CKM Hospital | వరంగల్ చౌరస్తా, ఫిబ్రవరి 11 : సీకేఎం హాస్పిటల్ వైద్య సేవల నిర్లక్ష్యానికి నిదర్శనం ఈ ఘటన. సీకేఎం హాస్పిటల్ అవసరాలకు వినియోగిస్తున్న టీఎస్ 03 యూబీ 7066 నంబర్ కలిగిన అంబులెన్స్ స్టార్ట్ కావడం లేదని సీకేఎం సిబ్బంది వాహనాన్నిఎంజీఎం హాస్పిటల్ సెంటర్లోని రాజరాజేశ్వరి ఆలయం ముందు వదిలివెళ్లారు. వాహనాన్ని వదిలివెళ్లి నాలుగు రోజులు గడిచినా పట్టించుకోని వైద్యాధికారుల తీరు వైద్యసేవలు, నిర్వహణకు అద్దం పడుతుంది.
వరంగల్ సీకేఎం హాస్పిటల్ అందిస్తున్న ప్రసూతి వైద్య సేవలకు అనుసంధానంగా ఇతరత్రా వైద్యసేవలు, స్కానింగ్, 2డీ ఎకో లాంటి ఇతరత్రా వైద్య పరీక్షలు అవసరమైన పేషెంట్లను అంబులెన్స్‌లో ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరలించి.. పరీక్షలు నిర్వహించిన అనంతరం తిరిగి సీకేఎం హాస్పిటల్‌కు తరలిస్తుంటారు. ఇందుకుగాను ప్రస్తుత గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి రాజ్యసభ సభ్యురాలిగా వున్న సమయంలో ఎంపీ నిధుల నుండి అందించిన అంబులెన్స్‌ను వినియోగిస్తున్నారు.
నాలుగు రోజులుగా రోడ్డు మీదే ఉంటుందని..
ఇదిలా ఉండగా గత నాలుగు రోజుల క్రితం రోజుమాదిరిగానే ప్రత్యేక వైద్య పరీక్షలు అవసరమైన పేషెంట్లతో ఎంజీఎం హాస్పిటల్‌కు చేరుకున్న అంబులెన్స్ రోడ్డు మీద మోరాయించింది. దాంతో అంబులెన్స్‌ను అక్కడే వదిలి సిబ్బంది మరో అంబులెన్స్‌లో పేషంట్లను తరలించారు. మొరాయించిన వాహనాన్ని అక్కడి నుండి తరలించాల్సింది పోయి అక్కడే వదిలేశారు. దాంతో గత నాలుగు రోజులుగా సీకేఎం హాస్పిటల్ అంబులెన్స్ రోడ్డు మీదే ఉంటుందని సోషల్ మీడియా వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న సీకేఎం హాస్పిటల్ వైద్యాధికారులు హూటాహూటిన అంబులెన్స్‌ను అక్కడి నుండి మరమ్మత్తుల కోసం తరలించారు.
అత్యవసర పరిస్థితుల్లో అవసరమయ్యే అంబులెన్స్ విషయంలో వైధ్యాధికారులు, సిబ్బంది వ్యవహరించిన తీరుపై అటు నెటిజన్లు, ఇటు పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం స్పందించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసులో జైలుకు రాజ్‌పాల్ యాదవ్.. సల్మాన్, అజయ్ సహా సాయమందిస్తున్న బాలీవుడ్
SreeLeela | నటి నుంచి డాక్టర్‌గా.. మెడిసిన్ పట్టా అందుకున్న టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల