ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసే వారికే పట్టం కట్టాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హన్వాడ మండలంలోని టంకర, గుడిమల్కాపురం, రాంనాయక్ తండాల్లో బుధవారం ఇంటింటి ప్రచారం చేపట్టా రు. ఆయా గ్రామాల్లో మహిళలు, స్థానికులు డప్పుచప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో 250 మంది బీజేపీ, కాంగ్రెస్ నేతలతో పాటు టంకర గ్రామంలో పలువురు నాయకులు మంత్రి స మక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సమైక్య పాలనలో 60 ఏండ్లలో జరగని అ భివృద్ధిని కేవలం పదేండ్లలోనే చేసి చూపించామన్నారు. ఎన్నికల్లో 22 రోజులు నా కోసం పనిచేస్తే 24 గంటలూ అందుబాటులో ఉంటానన్నారు. కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. హస్తానికి ఓటు వేస్తే తీవ్రంగా నష్టపోతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయన్నారు.
హన్వాడ, నవంబర్ 8 : కాంగ్రెస్ ప్రభుత్వం 60ఏండ్లు అధికారంలో ఉండి చేయని అభివృద్ధి పదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసి చూపించామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండలంలోని టంకర, గుడిమాల్కాపూరం, రాంనాయక్తండాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని కార్యకర్తలకు వివరించారు. చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ప్రజలు మోసపోకుండా ఆలోచించి పని చేసేవారికి పట్టం కట్టాలన్నారు. సౌభాగ్యలక్ష్మి కింద ప్రతి మహిళకు నెలకు రూ 3వేలు అందిస్తామని, మహిళలకు ప్రతి నెలా రూ.3వేల జీవనభృతి, రూ.5లక్షల ఆరోగ్యశ్రీ నిధి రూ.15లక్షలకు పెంపు, ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యంతోపాటు నెలకు రూ5వేల పింఛన్ అందిస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. 22 రోజులు నా కోసం పనిచేస్తే మీ కోసం 24గంటలు అందుబాటులోనని ఉంటానన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల చేరికలు.. మండలంలోని టంకరలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన బొంగురాజు, మల్లేశ్, నరేశ్, శ్రీను, వెంకటేశ్, నాగరాజ్‌తోపాటు మరికొందరు బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, రామణారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కారుణాకర్గౌడ్, సర్పంచులు అచ్చ న్న, బాలాగౌడ్, మాగ్యనాయక్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, ఎంపీటీసీ లక్ష్మమ్మ, నాయకులు లక్ష్మయ్య, జంబులయ్య, శివకుమార్, శ్రీనివాసులు, వడ్లశేఖర్, బాలయ్య, యాదయ్య, నరేందర్, హరిచందర్, చెన్నయ్య, జహంగీర్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబర్ 8 : నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కొనసాగేందుకు బీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బుధవారం న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలరాజ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనుచ 100మంది, జిల్లా వంట కార్మికుల సంఘం అధ్యక్షుడు కాలె నరేందర్, శివకుమార్, రహీం, షకీల్ ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 50మంది, టీడీగుట్టకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చిన్న ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 100మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మహబూబ్‌నగర్ సోమ వంశీ ఆర్య క్షత్రీయ సమాజ్ (నాండ్ల సంఘం) సంఘం నాయకుడు సుభాశ్‌రావు ఆధ్వర్యంలో ప్రతినిధులు మంత్రిని కలిసి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నాండ్ల సంఘం నాయకులు అంబాశంకర్, సతీశ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.