మహబూబ్నగర్, సెప్టెంబర్ 13 : ప్రస్తుతం ఏ ఇంట చూసినా దగ్గు, జలుబు, జ్వరాలతో సతమతమవుతున్న వారే కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పుల తో చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామం ది డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తదితర విషజ్వరాల బారిన పడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు అన్నీ విషజ్యరాలతో బాధపడుతున్న వారితో నిండిపోయాయి. నెల రోజులుగా జనరల్ దవాఖానకు వచ్చే రోగుల సం ఖ్య 1400 నుంచి 2 వేల వరకు పెరిగింది. ప్రైవేట్ దవాఖానల్లో నూ భారీగానే కేసులు నమోదవుతున్నాయి.
జిల్లాలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) మె రుగైన వైద్యం అందక జనరల్ దవాఖానను ఆశ్రయిస్తున్న రోగు ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇక్కడ సాధారణ జ్వరాలు, ఒంటినొప్పు లు ఇతర సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. అయి తే నిత్యం ఎక్కువ మంది రోగులు వస్తుండడం తో వైద్యులు హడావుడిగా చికిత్స చేస్తూ చేతులు దు లుపుకొంటున్నారని రోగులు వాపోతున్నారు. నాడిపట్టి పరీక్షించి రోగితో సమస్య తెలుసుకునే పరిస్థితి లేద ని, సాధారణ పరీక్షలు నిర్వహించి తోచిన మందు లు ఇచ్చి పంపుతున్నారని ఆరోపిస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వర్షాకాలం ప క్కా ప్రణాళిక కొవరడుతున్నది. పట్టణ ఆరోగ్య కేం ద్రాల పరిధిలో రోగుల తాకిడికి అనుగుణంగా సేవలందిడం లేదు. వాన నీరు నిలిచి పొంగిపొర్లకుండా చూడాల్సిన మున్సిపాలిటీ సిబ్బంది మాత్రం మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నారు. పారిశుధ్యం, దోమల నివారణకు ఏటా సీజన్లో రూ.3 కోట్ల మేర ఖర్చు పెడుతున్నా ఫలితం కనిపించడం లేదు. జిల్లా కేంద్రంలో కనీసం ఫాగింగ్ మీషన్లు కూడా ఉపయోగించడం లేదు. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధుల ని యంత్రణకు అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా, ఆ దిశగా ఆరోగ్య శా ఖ అధికారులు చర్యలు చేపట్టడం లేదు. పట్టణంలో నిత్యం లక్ష మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండ గా సేకరించడంలో జరుగుతున్న జాప్యం వల్లే వ్యా ధులు ప్రబలడానికి ప్రధాన కారణం.
ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు వేల మం దికి డెంగ్యూ పరీక్షలు చేయగా చాలా మందికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు 237 మందికి డెంగ్యూ నిర్ధారణ అయ్యింది. అయితే ఒక్క మోతీనగర్ పరిధిలో గురువారం 15 కేసులు రాగా శుక్రవారం మ రో రెండు కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి డెంగ్యూ కే సులు చాలా వరకు పెరిగాయి. మోతినగర్, పీపీ యూనిట్, షాషాబ్గుట్ట, వెంకటేశ్వరకాలనీ, ఎదిర, క్రిస్టియన్పల్లి, తిమ్మసానిపల్లి, రామయ్యబౌలి, న్యూటౌన్, బండ్లగేరి ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.
వాతావరణ మా ర్పులతో సీజనల్ వ్యాధులు పెరిగా యి. ముందస్తు జా గ్రత్తలు తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు. ప్రధానంగా వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువ, ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. దీని వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెందుతా యి. చిన్న జ్వరం, జలుబుకు పిల్లలకు యాం టిబయోటిక్స్ ఇవ్వకూడదు. వైద్యుల సూచన మేరకు మందులు వేసుకోవాలి.
– డాక్టర్ పద్మ, డీఎంహెచ్వో, మహబూబ్నగర్