సోమవారం 25 జనవరి 2021
Mahabubnagar - Nov 16, 2020 , 01:56:01

ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం శుభవార్త

 ఆర్టీసీ ఉద్యోగులకు  సీఎం శుభవార్త

  • గతంలో 2నెలల జీతం కోత
  •   సగం చెల్లించేందుకు  ప్రభుత్వం చర్యలు

మహబూబ్‌నగర్‌: ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం ముఖ్యమంత్రి శుభవార్త ప్రకటించారు. మార్చి, ఏప్రిల్‌ నెలలో కరోనా సమయంలో 50శాతం ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. అయితే కోతలోని 50శాతం వేతనం చెల్లించాలని  సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులు కరోనా సమయంలో విధులు నిర్వహించనప్పటికీ, విడుతలవారీగా వేతనం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 9డిపోలు ఉండగా, 4190 మంది ఉద్యోగులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులకు రూ.130 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. logo