నాగర్‌కర్నూల్ టౌన్, జూలై 13 : నాగర్‌కర్నూల్‌లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1986వ సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఒక చోట కలిసి ఆడుతూ పాడుతూ తమ ఆనందాలను వ్యక్తం చేశారు. చదువుకున్న పాఠశాల ఆవరణలో క్రికెట్ పోటీలు ఏర్పాటు చే యగా, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ముఖ్య అతిథి గా హాజరై పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్నేహితులంతా క్రికెట్ ఆడి నా టి మధుర అనుభూతులను స్మరించుకున్నా రు. అనంతరం ఆర్వో ప్లాంట్ నిర్వహణ కోసం రూ.20వేల సాయాన్ని హెచ్ఎంకు అందించారు. గగ్గలపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు రెండు క్రికెట్ కిట్లను అందజేశారు.