మూసాపేట, ఏప్రిల్ 20 : దేవరకద్ర నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జోరందుకున్న ది. దేవరకద్రతోపాటు చిన్నచింతకుంట, మూ సాపేట, అడ్డాకుల, భూత్పూర్ మండలాల్లో ఉన్న వాగు నుంచి నిత్యం ఇసుక తరలిపోతో ంది. అనుమతుల పేరుతో పగలు.. అక్రమంగా రాత్రి వేళల్లో రవాణా జోరుగా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక వైపు పెద్దలుగా చెప్పుకునే కొందరు ప్రభుత్వ నిర్మాణాల పేరుతో అనుమతి పొందుతున్నారు. ఊకచెట్టు, పెద్ద వాగుల నుంచి ఇసుక తీసి డంపులు చేస్తూ రాత్రి సమయాల్లో టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నేరుగా వాహనాలు వాగులోకి వెళ్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
ఇసుక వ్యాపారం జోరుగా సాగుతున్నా.. స్థానికంగా ఇండ్లు నిర్మించుకునే వారికి మాత్రం ఇసుక కొరత ఉన్నది. ఎడ్ల బండ్లపై ఆధారపడి ఇసుకను కొనుగోలు చేస్తుండడంతో సామాన్య ప్రజలకు భారంగా మారుతోంది. కొందరు నాయకులు ఏకంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇతర అభివృద్ధి పనుల పేరుతో ఇసుక రవాణాకు తెగబడుతున్నారు. మరోవైపు దళారులు మాత్రం అధికారులను మచ్చిక చేసుకొని ప్రత్యేక దా రులు ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని మూడు పువ్వులు-ఆరు కాయలుగా కొనసాగిస్తూ సొ మ్ము చేసుకుంటున్నారు.
ఇసుక తరలిపోతుందని స్థానిక యువత, అధికారులకు సమాచారం అందిస్తే దళారులకే ముందుగా ఇన్ఫర్మేషన్ చేరుతోంది. అధికారులు వచ్చే సరికి అక్కడి నుంచి వాహనాలు వెళ్లిపోతున్నాయి. ఇక్కడి వాగులలో ఉండే తెల్ల, పాల రాతి ఇసుకకు పట్టణ ప్రాం తాల్లో మంచి డిమాండ్ ఉన్నది. అందుకే చీకటి పడితే చాలు మినీ డీసీఎంలు, ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. వాగులో వాహనాలు ఉన్న సమయంలో అటు వైపు ఎవరు వెళ్లినా వెంటనే రోడ్డుపై కాపు కాస్తున్న వ్యక్తి ఫోన్లో సమాచారం అందిస్తాడు.. దీంతో వారు తప్పించుకునే వీలుంది. ఇలా అధికారులు ఎక్కడికి వెళ్లినా ఇసుక తరలించే వాహనాలు లేక వెనుతిరుగుతున్నారు. తర్వాత ఇసుక నింపుకొన్న వాహనాలు రోడ్డెక్కితే చాలు దర్జాగా మెరుపు వేగంతో వెళ్తుంటాయి.
ప్రభుత్వ నిర్మాణాలు, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక తరలించేందుకు స్థానిక తాసీల్దార్ అనుమతిని వ్యాపారులు పొందుతున్నారు. తర్వాత నిబంధనలను ఉల్లంఘించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇష్టానుసారంగా ఇసుకను తోడేస్తున్నారు. అనుమతి పేరుతోనే రాత్రిళ్లు య థేచ్ఛగా చీకటి దందాకు తెరలేపారు. రాత్రయితే చాలు రోడ్లపై ఇసుక వాహనాలు రయ్.. రయ్.. మంటూ రాకపోకలు సాగిస్తున్నాయి. మూసాపే ట మండలం జానంపేట,
కొమిరెడ్డిపల్లి, పో ల్కంపల్లి, అడ్డాకుల మండలం పొన్నకల్, కం దూరు, వర్నే, ముత్యాలంపల్లి తదితర గ్రామాల శివారు వాగుల నుంచి.. అలాగే భూత్పూర్ మ ండలం కప్పెట, రావులపల్లి, కౌకుంట్ల మండ లం ఇస్రంపల్లి, అప్పంపల్లి, చిన్నచింతకుంట మ ండలం బండ్లవల్లి, ముచ్చింతల, చింతకుంట, మద్దూరు, అల్లీపూర్, దేవరకద్ర నియోజకవర్గంలోని ఊకచెట్టు వాగు పరిధిలోని పెద్దరాజమూరు, గురకొండ, మీనిగోనిపల్లి తదితర గ్రామాల వాగుల నుంచి జో రుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోం దన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో పగటి పూట ఎడ్లబండ్ల ద్వారా రవాణా చేయగా.. నేడు రాత్రి సమయంలోనూ తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మా త్రం కన్నెత్తి చూడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా విమర్శలు మూసాపేట, అడ్డాకుల, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల్లోని వాగుల శివారు గ్రామాల్లో ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక వ్యాపారం జోరందుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
అయితే కొందరు యువకులు వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ బహిరంగంగానే అధికారులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇసుక తరలించే ప్రదేశాలకు వెళ్లి.. వీడియోల ద్వారా ఇసుక డంపులను చూయిస్తూ అక్రమ రవాణా విషయాలను బట్టబయలు చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం నామ్కే వాస్తేగా.. కొన్ని వాహనాలనే పట్టుకోవడం.. తర్వాత వదిలిపెట్టడం పరిపాటిగా మారిందన్న విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టి ఇసు క అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని నదుల పరీవా హక ప్రాంతాల ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.