ఖిల్లాఘణపురం, డిసెంబర్ 5 : పదేండ్ల అభివృద్ధి కా వాలా..? రెండేళ్ల విధ్వంసం కావాలా? అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరై మాట్లాడుతూ ఖిల్లాఘణపురం మండల కేంద్రాన్ని కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేశామని, అభివృద్ధే ధ్యేయంగా తన మన అనే తారతమ్య లేకుండా పనిచేశామని, ఓటు అడిగే నైతిక హక్కు మనకే ఉందని స్పష్టం చేశారు.
కేసీఆర్‌కు మిం చిన సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఓట్లు అడిగే కాంగ్రెస్ నాయకులను రైతులకు రైతు భరో సా ఏదని, మహిళలకు రూ.2500, ఆసరా పింఛన్లు రూ.4వేలు, తులం బంగారం , విద్యార్థినులకు స్కూ టీలు, ధాన్యానికి బోనస్, కేసీఆర్ కిట్టు, కంటి వెలుగు, బతుకమ్మ చీరలు ఏమయ్యాయని నిలదీయాలని పిలుపునిచ్చారు. గణప సముద్రం భూములు కొల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.20లక్షలు ఇస్తామని గొప్పలు చెప్పి ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ నాయకులని మండిపడ్డారు. పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. పార్టీకి ద్రోహం చేస్తే సహించేది లేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన ఖిల్లాఘణపురం సర్పంచు అభ్యర్థి క్యామ అజంతా గెలుపు కీలకమని, ఆమె గెలుపు కోసం శక్తివంచన లేకుండా ప్రతి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణనాయక్, సామ్యనాయక్, ఆంజనేయులుగౌడ్, రాఘవేందర్‌గౌడ్, నరేందర్, బాబు, కొండలు, వెంకటరమణ, సురేందర్, శరత్‌కుమార్, రవీందర్‌రెడ్డి, బుచ్చిబాబుగౌడ్, సత్యం, కృష్ణగౌడ్, భూమయ్య, మహేశ్, మల్లేశ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.