e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు అధిక ధరకు విక్రయించొద్దు

అధిక ధరకు విక్రయించొద్దు

అధిక ధరకు విక్రయించొద్దు

మార్కెట్‌ను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ
అధికారులకు సూచనలు
కురవిలో పర్యటించిన వీపీ గౌతమ్‌

మహబూబాబాద్‌, మే 25 : ‘నిత్యావసర సరుకులను అధిక ధరకు విక్రయించొద్దు. అలా విక్రయించిన షాపులపై చర్యలు తీసుకుంటామని’ కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో అన్ని శాఖల అధికా రులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సరుకుల విక్రయాలపై అడిష నల్‌ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ (ఏసీఎల్‌బీ) నేతృత్వంలో కమిటీని నియమించినట్లు తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలను 24 గంటలలోపు షాపుల ఎదుట ఏర్పాటు చేయా లన్నారు. కొవిడ్‌ కంట్రోల్‌రూమ్‌ నంబర్లు 08719-2985 26, 08719-240400, 7995074 803 ఫ్లెక్సీపై నిర్వా హకులు రాయించుకోవాలన్నారు. కమిటీ చైర్మన్‌గా జిల్లా అదనపు కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ వ్యవహరిస్తార న్నారు. డీఏవో ఛత్రునాయక్‌ ఏడీఎస్‌వోగా, జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారి నర్సింగారావు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ రమేశ్‌, యాకాంబ్రం, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సూర్యనారాయణ, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి సురే ఖ, మెట్రాలజీ అధికారి విజయ్‌, జిల్లా వెటర్నరీ అధికారి సుధాకర్‌ సభ్యులుగా ఉంటారని చెప్పారు.
భౌతికదూరం పాటించాలి
కూరగాయల మార్కెట్‌, కిరాణా దుకాణాల వద్ద కొనుగోళ్ల సమయంలో ప్రజలు గుమికూడకుండా భౌతిక దూరం పాటించాలని కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ సూ చించారు. క్యూలైన్‌ పాటిస్తూ సరుకులు కొనుగోలు చేయాలన్నారు. కలెక్టర్‌ గౌతమ్‌, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, అదనపు కలెక్టర్‌ అభి లాష అభినవ్‌తో కలిసి మార్కెట్‌ను ఆకస్మికంగా పరిశీ లించి విక్రయదారులకు సూచనలు చేశారు. వారి వెంట ఆర్డీవో కొమురయ్య, ఏఎస్పీ యోగేశ్‌ గౌతమ్‌, మున్సిపల్‌ కమిష నర్‌ నరేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రంజిత్‌, సీఐలు వెంకట రత్నం, రవికుమార్‌, ఎస్సై శంకర్‌రావు ఉన్నారు.
రెండో దశను అడ్డుకుందాం
కరోనా రెండో దశను కలిసికట్టుగా అడ్డుకుందామని కలెక్టర్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్‌తో కలిసి విలేకరుల స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మొదటి దశ కంటే రెండో దశ ఉధృతంగా ఉందని, నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. పెళ్లిళ్లు, దహన సంస్కారాల పేరుతో లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించొ ద్దని చెప్పారు. ఇప్పటి వరకు 5600 ఈ-పెట్టీ కేసులు నమోదు చేసి జరిమానా విధించామన్నారు. 2100 వా హనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. డీఎంహెచ్‌వో మాట్లా డుతూ 49 బృందాలు ఇంటింటా జ్వర సర్వేలో పాల్గొని లక్షణాలు ఉన్న వారిని గుర్తిస్తున్నారని వివరించారు.
బాధితులను క్వారంటైన్‌ సెంటర్లకు తరలించాలి
కురవి: వసతులు లేక ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను మండలకేంద్రంలోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులను అదే శించారు. మంగళవారం మండలకేంద్రంతో పాటు కంది కొండ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జ్వర సర్వేను, అలాగే రెండో డోస్‌ వ్యాక్సినేషన్‌ తీరును పరిశీ లించారు. ఆ తర్వాత కందికొండ గ్రామాన్ని సంద ర్శించా రు. పల్స్‌ రేట్‌ తక్కువగా ఉన్న వారిని దవాఖానకు తర లించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో హ రీశ్‌రాజ్‌, తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, ఎంపీడీవో ధన్‌ సింగ్‌, డాక్టర్‌ శ్వేత, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అధిక ధరకు విక్రయించొద్దు

ట్రెండింగ్‌

Advertisement