e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిల్లాలు పకడ్బందీగా లాక్‌డౌన్‌

పకడ్బందీగా లాక్‌డౌన్‌

పకడ్బందీగా లాక్‌డౌన్‌

నిర్మానుష్యంగా గ్రామాలు
రహదారులపై పోలీసుల గస్తీ
నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమా
నా
పరకాల/నర్సంపేట/ఆత్మకూరు/దామెర/శాయంపేట/చెన్నారావుపేట/దుగ్గొండి, మే 16 : జిల్లా వ్యా ప్తంగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత గ్రామాలన్నీ నిర్మా నుష్యంగా మారుతున్నాయి. పోలీసులు రహదారుల పైకి వచ్చి కాపలా కాస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిం చిన వారికి జరిమానా విధిస్తున్నారు. ఆదివారం పరకా లలో 130 వాహనాలకు జరిమానా విధించినట్లు సీఐ పింగిళి మహేందర్‌ రెడ్డి తెలిపారు. బస్టాండ్‌ సెంటర్‌లో సీఐ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని సూచించారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయాల్లో బయటికి వచ్చే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. అలాగే, ఆత్మకూరు మండలంలోని గూడెప్పాడ్‌ జంక్షన్‌ వద్ద చెక్‌ పోస్టును ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వస్తున్న వారికి సీఐ రంజిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో కౌన్సె లింగ్‌ నిర్వహించి, జరిమానా విధిస్తున్నారు. నర్సం పేటలో లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

పది మందిపై కేసు నమోదు చేశారు. నర్సంపేట అయ్యప్ప ఆలయం వద్ద ఉన్న చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను పరిశీలిస్తున్నారు. అనుమతులు లేకుంటే నిలిపివేస్తు న్నారు. అలాగే, దామెర ఎస్సై భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఓగ్లాపురం, ఊరుగొండ వద్ద వరంగల్‌-భూపాల పట్నం జాతీయ రహదారిపై వాహనదారులను తనిఖీ చేశారు. ట్రైనీ ఎస్సై, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొ న్నారు. శాయంపేట మండల పరిధిలో ఆదివారం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన 20 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అకినపెల్లి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని మాందారిపేట హైవే, శాయంపేట సెంటర్‌తో పాటు అన్ని గ్రామాల్లో నిరంతర తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ప్రొబేషనరీ ఎస్సై లవన్‌కుమార్‌, సిబ్బంది ఉన్నారు. అలాగే, చెన్నారావుపేట మండలంలోని నెక్కొండ- నర్సంపేట ప్రధాన రహదారిపై ఎస్సై శీలం రవి వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన 25 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై మహేందర్‌, కానిస్టేబుళ్లు తిరుపతి, రామకృష్ణ, ఉపేందర్‌, క్రాంతికుమార్‌ పాల్గొన్నారు. దుగ్గొండి మండలంలోని గిర్నిబావి వద్ద చెక్‌పోస్ట్‌లో ఎస్సై రవికిరణ్‌ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పకడ్బందీగా లాక్‌డౌన్‌

ట్రెండింగ్‌

Advertisement