Office Meeting | ఆఫీస్‌లో మీటింగ్. టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇరవై నిమిషాల్లో ముగిద్దామని ప్లాన్ చేసుకున్నా .. రెండు గంటలైనా పూర్తికాలేదు! ఒక్కో ఉద్యోగి ఒక్కో రకం వక్తగా మారిపోయారు. ఎవరి తరహాలో వాళ్లు అభిప్రాయాలుచెబుతూ పోతున్నారు. సమావేశం సాగుతూనే ఉంది. కారణం.. టాపిక్ డైవర్ట్ అయిపోయి.. ట్రాఫిక్ జామ్ అయ్యింది!
వర్క్ ప్లేస్ మీటింగ్స్ సర్వసాధారణం. కొత్త ఐడియాలు వండివార్చడానికి, సరికొత్త ఆలోచనలు అమలు చేయడానికి ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయి. అరగంటలో పూర్తిచేద్దాం అనుకున్న సమావేశం కొన్నిసార్లు రెండుగంటలైనా కొనసాగుతూనే ఉంటుంది. అజెండాకే పరిమితమైతే సకాలంలో ముగించవచ్చు. కానీ, కొందరు కొలీగ్స్ తమలోని వక్తను నిద్రలేపి.. కాలాన్ని కరకరా నమిలే స్తుంటారు. బాస్ మెప్పు కోసం టాలెంట్‌నంతా ఉపయోగించేవారు ఇంకొందరు. ఇలా ఆఫీస్ మీటింగ్స్‌లో సభ్యుల వక్తృత్వ పటిమను బట్టి ఏ కేటగిరీకి చెందినవాళ్లో గుర్తించవచ్చు. వాళ్లను మీరూ పరిచయం చేసుకోండి..
బాస్ దృష్టిలో పడితే ఆటోమెటిగ్గా పేరొస్తుందనే నమ్మకంతో ఉంటారు. అందుకే, సమావేశాల్లో బాసులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏం మాట్లాడుతున్నామన్నది రెండో ప్రాధాన్యమే! ఒకే అంశాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి చెప్పేస్తుంటారు.
వీరు మాట్లాడుతున్నంత సేపూ ఏదో కొత్త విషయం.. మనకు తెలియని సబ్జెక్ట్ పరిచయం చేస్తున్న భావన కలుగుతుంది. ఈ తరహా వక్తల్లో ఎవరి దృష్టినో ఆకర్షించాలనే ఉద్దేశమైతే కనిపించదు. జీవితం చుట్టూ పెనవేసుకున్న వాటిని ఎక్కువగా ప్రస్తావిస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ఆకట్టుకుంటారు. ఒక ఉదాహరణకు మరో ఉదాహరణకు మధ్యన కొంత గ్యాప్ తీసుకుం టారు. ‘చిన్న బ్రేక్ తీసుకొని చిటెకెలో వచ్చేస్తా’ బ్యాచీఅన్నమాట.
మీటింగ్‌లో సైలెంట్‌గా ఉంటారు. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వింటారు. తాము మాట్లాడటం వల్ల ఏదైనా ఉపయోగం ఉందని భావిస్తేనే పెదవి కదుపుతారు. అది కూడా క్లుప్తంగా! ఒకటీ రెండు మాటలతో ముగిస్తారు. కొన్నిసార్లు ఎవరు ఎంత ఒత్తిడి చేసినా ఒక్క మాటా మాట్లాడరు. వాళ్లకు మాట్లాడాలని అనిపించినప్పుడే స్పందిస్తారన్నమాట. కాకపోతే ఇలాంటి వారితో మీటింగ్‌కు ఎలాంటి అంతరాయమూ ఉండదు.
Office Meeting2
కొందరు పూర్తిగా సైలెంట్‌గా ఉంటారు. కాకపోతే ప్రతీది గమనిస్తారు. మీటింగ్‌లో ప్రస్తావనకు వచ్చిన ప్రతీ పాయింట్‌ను నోట్ చేసుకుంటారు. వీరిలో పాజిటివ్ పాయింట్ ఏంటంటే మీటింగ్ వ్యవధిని పెంచడానికి అస్సలు ఒప్పుకోరు. ఉపన్యాసం అనేది అమ్మాయి స్కర్ట్ లాంటిది. మరీ పెద్దగా ఉంటే మొరటుగా అని పిస్తుంది. మరీ కురచగా ఉంటే అసహ్యంగా ఉంటుంది. ఇదీ సంగతి.
కొందరు ఏం మాట్లాడినా చమత్కారంగా మాట్లాడతారు. సబ్జెక్ట్‌ను పక్కదారి పట్టించకుండా ప్రసంగిస్తూనే హాస్యాన్ని జోడిస్తుంటారు. అప్పటికప్పుడు పంచులు విసురుతూ అందరినీ అలరిస్తారు. ఆ మాటలు మనసుల్నీ తాకుతాయి. సీరియస్ విషయాలు చర్చించేటప్పుడు ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుందని చాలా అధ్యయనాల్లో నిరూపితమైంది.
వీళ్లు మెలికలు తిరుగుతూ మాట్లాడుతుంటారు. ప్రతీదానికి తలూపుతుంటారు. ఏదో చెప్తూ చెప్తూ చివరికి మొదట చెప్పిన పాయింట్‌కే వస్తుంది వీరి ముచ్చట. ఫైనల్‌గా.. అది చెప్పాలి.. ఇది చెప్పాలి అని మైండ్‌లో ఫిక్స్ అవుతారు. కానీ పాయింట్‌కు వచ్చేసరికి ఒకటి అనుకొని మరొకటి చెప్పి ముగిస్తారు. కొన్నిసార్లు వివాదాస్పద ప్రకటనలు చేస్తారు. తలతిక్క చర్చలూ లేవనెత్తుతారు.
ప్రతి విషయంలో తప్పు దొరకబట్టడానికి ప్రయత్నిస్తారు కొందరు. ప్రాజెక్ట్ సరైన సమయంలో ఎందుకు పూర్తిచేయలేదు అని అడిగితే.. మూలం నుంచీ కారణం చెబుతూ గంటలకొద్దీ మాట్లాడే రకం. అంతమాత్రాన చాలా కష్టపడి పనిచేస్తున్నారనీ అనలేం! ఒకరి తప్పును ఎత్తి చూపుతారు కానీ, ఆ తప్పు జరగకుండా ఏం చేయాలో మాత్రం చెప్పరు. పక్కా విమర్శకుల బ్యాచ్ అన్నమాట.
ఎదుటి వాళ్లకు జ్ఞానాన్ని అందించాలన్న ఆబతో మాట్లాడేవాళ్లూ ఉంటారు. పని విషయంలో జరిగిన కొన్ని పొరపాట్లను, వాటిని చక్కదిద్దడానికి ఉపయోగించాల్సిన కిటుకులను చెప్పడం కోసం వాస్తవ సంఘటనలను, ఉదాహరణలను ఉటంకిస్తారు. అయితే వీరు చెప్పేవన్నీ కచ్చితమే అని మాత్రం నిర్ధారించలేం. నలుగుర్నీ ఆకట్టుకోవడానికే ఇదంతా. ఉపన్యాసం మధ్యలో రచయితలు, ఫిలాసఫర్స్ పేర్లు చెబుతూ తమ విషయ పరిజ్ఞానాన్ని చాటుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు.
“Sandeep Maheshwari | ఈ ఢిల్లీ కుర్రాడు ఫొటోలతో కోట్లు సంపాదిస్తూ ఎంతోమందికి రోల్ మాడల్‌గా మారాడు”
“Nikhil Kamath | 14వ ఏటనే బడి మానేసిన కుర్రాడు.. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌కే కింగ్ అయ్యాడు!!”