బీబీనగర్, ఫిబ్రవరి 11 : బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామంలో గల శ్రీ లింగబసవేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమోగింది. ఉదయం 11 గంటలకు దేవస్థాన అభివృద్ధి కమిటీ చైర్మన్ సందిగారి బస్వయ్య, ఈఓ నరేందర్ రెడ్డి సమక్షంలో వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, తాసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, సీఐ ప్రభాకర్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పడమటిసోమారంలో లింగబసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
భక్తుల ‘హర హర మహాదేవ’ నినాదాలతో ఆలయం మార్మోగింది. గ్రామస్థులు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. మూడు రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలు, అర్చనలు, ఊరేగింపులతో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పడమటిసోమారంలో లింగబసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ భాస్కర్, దేవస్థానం ధర్మకర్తలు ఆలేటి బలరాం, ఆల్వ గోపాల్ రెడ్డి, నడికుడి వెంకటేశ్, గొరుకంటి జాతయ్య, మాజీ ఎంపీటీసీ బొమ్మగొని బస్వయ్యగౌడ్, మాజీ దేవాలయ చైర్మన్లు యర్రబోతు శ్రీనివాసరావు, ఆల్వ వీరారెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి, నాయకులు ఆల్వ రామకృష్ణారెడ్డి, ఆలేటి రాంకొండల్, కంభం భాస్కర్ గౌడ్, వాకిటి యాదిరెడ్డి, కుంభం సుభాష్ గౌడ్, తలబోయిన కృష్ణ యాదవ్, బొమ్మగొని బాలయ్య పాల్గొన్నారు.