Sandeep Maheshwari | ఈ ఢిల్లీ కుర్రాడు ఫొటోలతో కోట్లు సంపాదిస్తూ ఎంతోమందికి రోల్ మాడల్‌గా మారాడు
Sandeep Maheshwari | సందీప్ మహేశ్వరి తొమ్మిదో తరగతిలో ఉండగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇంటర్మీడియెట్‌కు వచ్చేనాటికి తానూ సంపాదించాల్సిన అవసరం వచ్చింది. వినూత్నంగా ఒక చిన్న ప్రయత్నం చేశాడు. ‘ఇంటర్మీడియెట్ తర్వాత..’ పేరుతో ప్లస్ టూ పాసైనవారికి అందుబాటులోఉన్న కోర్సులు, వాటిలో ఉపాధి అవకాశాల గురించి ఓ కరపత్రం ప్రచురించాడు.
Sandeep Maheshwari | కెరీర్ తొలినాళ్లలో శ్రద్ధపెడితే ఎంత గొప్ప విజయం సాధించవచ్చో చెప్పడానికిసందీప్ మహేశ్వరి ప్రయాణం ఓ ఉదాహరణ. అతని యూట్యూబ్ చానల్ ‘లైఫ్ ఛేంజింగ్ సెమినార్’ను కోటి మంది అనుసరిస్తున్నారు. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన సందీప్.. ‘అత్యంత వేగంగా ఎదుగుతున్న భారతీయ ఆంత్రప్రెన్యూర్స్ జాబితాలో చేరాడు. ‘ఫోర్బ్స్’ తోనూ శెబ్బాష్ అనిపించుకున్నాడు.
సందీప్ మహేశ్వరి న్యూఢిల్లీలో పుట్టి పెరిగాడు. పదో తరగతి వరకూ పెద్దగా స్నేహితులు లేరు. ప్రతిదానికీ సానుకూలంగా స్పందించే గుణం వల్ల కావచ్చు, మరీ మెతక మనిషి అనే పేరొచ్చింది. ఇంటర్మీడియెట్ చదువు సందీప్ జీవితంలో ఓ మైలురాయి. కాలేజీ ఆవరణ ఆలోచనా విధానాన్ని మార్చేసింది. అక్కడే నేహ పరిచయమైంది. వాళ్లిద్దరూ ఒకరికపై ఒకరు నమ్మకం పెంచుకున్నారు. ఆ స్నేహం ప్రేమకు దారి తీసింది. జీవితంలో నిలదొక్కుకుంటేనే ప్రేమ ఫలిస్తుందనే విషయాన్ని బాలీవుడ్ సినిమాలు చూసి తెలుసుకున్నాడు. ఇక కష్టపడటం మొదలుపెట్టాడు.
ఇంటర్ తర్వాత…
సందీప్ తొమ్మిదో తరగతిలో ఉండగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇంటర్మీడియెట్‌కు వచ్చేనాటికి తానూ సంపాదించాల్సిన అవసరం వచ్చింది. వినూత్నంగా ఒక చిన్న ప్రయత్నం చేశాడు. ‘ఇంటర్మీడియెట్ తర్వాత..’ పేరుతో ప్లస్ టూ పాసైనవారికి అందుబాటులోఉన్న కోర్సులు, వాటిలో ఉపాధి అవకాశాల గురించి ఓ కరపత్రం ప్రచురించాడు. దాన్ని అమ్మడం ద్వారా కొంత డబ్బు సంపాదించాడు. జనంలో మంచిపేరు కూడా సంపాదించాడు. సందీప్ గురించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ యాజమాన్యానికి తెలిసింది. అతడిని సంప్రదించింది. ఓ వ్యాపార ఒప్పందం చేసుకుంది. విద్యార్థులకు తమ సంస్థ శిక్షణను సిఫారసు చేయమని కోరింది. అలా చేసినందుకు, ప్రతి అడ్మిషన్కూ 20 శాతం కమిషన్ ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. డిగ్రీ రోజుల్లో సందీప్ ఫ్యామిలీ బిజినెస్ అయిన అల్యూమినియం వ్యాపారంలో అడుగుపెట్టాడు. అది కొద్ది కాలానికే దివాలా తీసింది. ఆ సమయంలో కుటుంబం పూర్తిగా తనపైనే ఆధారపడింది. చేసేదిలేక కాలేజీకి బైబై చెప్పేశాడు. గృహోపకరణాలు అమ్మే కంపెనీలో మార్కెటింగ్ ఏజెంట్‌గా చేరాడు.
రోల్ మాడల్
పందొమ్మిదేండ్ల వయసులో మాడలింగ్ను కెరీర్‌గా ఎంచుకున్నాడు సందీప్. కానీ, ఫ్యాషన్ పండితుల వేధింపులకు తాళలేకపోయాడు. అయితేనేం, అదే ఇండస్ట్రీలో ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్‌గా నిలదొక్కుకున్నాడు. అప్పటికే తనకు ఫొటోగ్రఫీలో అనుభవం ఉంది. కొంతకాలానికి సొంతంగా ‘మాష్’ ఆడియో, వీడియో విజువల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించాడు. మాడల్స్, సినిమా తారల ఫోర్ట్ ఫోలియోకి కావాల్సిన ఫొటోలు తీస్తూ పేరు సంపాదించాడు. సందీప్ మాడల్‌గా ఓడినా రోల్ మాడల్‌గా గెలిచాడు! జీవితపు చమత్కారాలు అలానే ఉంటాయి.

ఓటమిని అంగీకరించొద్దు
ఇద్దరు స్నేహితులతో కలిసి 2002లో ‘సందీప్ కన్సల్టెన్సీ సర్వీస్’ ప్రారంభించాడు సందీప్. ఆ ప్రయాణం కొద్ది కాలానికే ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించాడు. ఒకే రోజు 122 మాడల్స్‌తో.. 10 గంటల 45 నిమిషాల్లో 10,000 ఫొటోలు తీసి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. వాటిని ముడిసరుకుగా చేసుకుని ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని అనుకున్నాడు. ఆ సమయంలో ప్రకటనలు, ఇతర అవసరాల కోసం అతికినట్టు సరిపోయే ఫొటోలు దొరికేవి కాదు. ప్రత్యేకించి తీయించడం ఖరీదైన వ్యవహారం. పత్రికల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ‘ఇమేజ్ బజార్’ పేరుతో స్టాక్ ఫొటో బిజినెస్ ప్రారంభించాడు. ఆ వ్యాపారం ప్రారంభించిన కొత్తలో ఫొటోగ్రాఫర్, టెలికాలర్, కౌన్సెలర్ పనులన్నీ తానే చేస్తూ తన కంపెనీ ఇమేజ్ పెంచుకున్నాడు. అలా మొదలైన ఇమేజ్ బజార్ ఇప్పుడు భారతీయ చిత్రాలతో ఉన్న అతిపెద్ద ఇమేజ్ స్టాక్ పోర్టల్‌గా గుర్తింపు పొందింది. ఇమేజ్ బజార్‌కి 45 దేశాల్లో 7,000 మంది చందాదారులు ఉన్నారు. నూటఅరవై మంది ఫుల్‌టైమ్ ఫొటోగ్రాఫర్లు పని చేస్తున్నారు. సందీప్ సంపద విలువ 3.6 మిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ పత్రిక అంచనా వేసింది. ఈ ఫొటోగ్రఫీ వ్యాపార వ్యవహారాలే కాకుండా, రెండు యూట్యూబ్ చానల్స్ నిర్వహిస్తున్న సందీప్ కోట్లాది మందికి స్ఫూర్తిదాయక బోధనలు చేస్తున్నాడు. ఇప్పుడు, సందీప్ మహేశ్వరి ఔత్సాహిక పారిశ్రామికవేత్త, ఫొటోగ్రాఫర్, యూట్యూబర్, రచయిత, వక్త. అంతరాంతరాల్లో ఓ మానవతా వాది కూడా ఉన్నాడు. ‘నీ అవసరానికి మించిన సంపద నీ దగ్గర ఉంటే.. అవసరం ఉన్నవారితో దాన్ని పంచుకో’ అని సలహా ఇస్తాడు. ‘నెవర్ గివప్’ తన ఏక వాక్య నినాదం, జీవన విధానం కూడా.
Read More :
“Nikhil Kamath | 14వ ఏటనే బడి మానేసిన కుర్రాడు.. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌కే కింగ్ అయ్యాడు!!”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

