Coconut Milk | కొబ్బరిపాలను తాగుతున్నారా..? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!
కొబ్బరిపాలను కూడా మనం ఆహారంగా తీసుకుంటాం. కొబ్బరిని తురిమి దాని నుండి ఈ పాలను తయారు చేస్తారు. కొబ్బరి పాలల్లో చైన్ ట్రై గ్లిజరాయిడ్స్, లారిక్ యాసిడ్ సమృద్దిగా ఉంటాయి. కొబ్బరిపాలను తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది.
Coconut Milk | కొబ్బరిపాలను కూడా మనం ఆహారంగా తీసుకుంటాం. కొబ్బరిని తురిమి దాని నుండి ఈ పాలను తయారు చేస్తారు. కొబ్బరి పాలల్లో చైన్ ట్రై గ్లిజరాయిడ్స్, లారిక్ యాసిడ్ సమృద్దిగా ఉంటాయి. కొబ్బరిపాలను తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. కొన్ని అధ్యయనాలు కొబ్బరిపాలను తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని చెబుతున్నాయి. అయితే అధికంగా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరిపాలను వినియోగించే విధానం, శారీరక శ్రమ, జీవక్రియలపై వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు. అసలు కొబ్బరిపాలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిల్లో ఎటువంటి మార్పులు వస్తాయి. కొబ్బరిపాలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అలాగే కొబ్బరిపాలను ఏ విధంగా తీసుకోవాలి.. దీని గురించి వైద్యులు ఏమంటున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ స్థాయిలకు..
కొబ్బరిపాలల్లో ఉండే లిపో ప్రోటీన్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. ఈ పాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండెజబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కొబ్బరిపాలను 8 వారాల పాటు తీసుకోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ 18 శాతం పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే కొన్ని పరిశోధనలు కొబ్బరి పాలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని సూచిస్తున్నాయి. కొబ్బరి పాలల్లో ఉండే చైన్ ట్రైగ్లిజరాయిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి పాలు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచినప్పటికీ వీటిని అధికంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిలో క్యాలరీలు అధికంగా ఉంటాయని వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. కనుక వీటిని తక్కువ మోతాదులో తీసుకోవడమే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.
మోతాదులోనే తీసుకోవాలి..
ఇక కొబ్బరిపాలను తీసుకోవడం వల్ల ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. శరీర బరువు అదుపులో ఉంటుంది. జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొబ్బరిపాలు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాకు కూడా మద్దతును ఇస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొబ్బరిపాలను మితంగానే తీసుకోవాలి. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కనుక రోజూ కొన్ని టేబుల్ స్పూన్ల మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే తాజా కొబ్బరిపాలను ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ప్యాక్ చేసిన, చక్కెర కలిపిన కొబ్బరి పాలను తీసుకోకూడదు. కూరగాయలు, తృణ ధాన్యాలు, పండ్లు, చిక్కుళ్లు, లీన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలతో కొబ్బరిపాలను తీసుకునే ప్రయత్నం చేయాలి. సూప్స్, కూరలు, స్మూతీ వంటి వాటిలో పాలకు బదులుగా మనం కొబ్బరిపాలను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. కొబ్బరిపాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని అయితే వీటిని తగిన మోతాదులో తీసుకోవడం అవసరమని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఉన్న వారు వీటిని అధికంగా తీసుకోకూడదని కూడా వారు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Coconut milk
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

