Yaar Shoes | పాతకాలం గొంగడితో రైతుల కోసం స్పెషల్ బ్రాండెడ్ బూట్లు.. బురదలో ఇవి ఎలా పనిచేస్తాయంటే..
Yaar Shoes | రైతులు చెప్పులు లేకుండానే పొలంలో నడుస్తున్నారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరం. ఎరువులు, పురుగు మందుల ప్రభావంతో పలు రసాయనాలు మట్టిలో కలిసిపోయి ఉంటాయి. నేలలోని గాజు ముక్కల్లాంటివి గుచ్చుకునే ప్రమాదమూ ఉంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ రావొచ్చు.
Yaar Shoes | ఎండనక, వాననక రెక్కలు ముక్కలు చేసుకునే రైతు కష్టం మాటల్లో చెప్పలేం. ఆ బాధను కొంతైనా తీర్చగలమా? అని ఆలోచించారు ఆ ముగ్గురు స్నేహితులూ. మట్టి నుంచి బువ్వ తీసే రైతుకు మేలు చేసి రుణం తీర్చుకుందామని తీర్మానించారు. బురదలో గాయపడే సేద్యగాడి కాలికి మేలైన బూట్లు తయారు చేయడం మొదలుపెట్టారు. వాటిని ‘యార్’ అనే బ్రాండ్‌తో మార్కెట్లోకి తెచ్చారు. ‘ఎర్త్ ఎన్ ట్యూన్స్’ వ్యవస్థాపకుల్లో ఒకరైన సంతోష్ కొచ్చర్లకోట తమ ఆంత్రప్రెన్యూర్‌షిప్ ప్రయాణాన్ని వివరిస్తున్నారిలా..
రైతులు చెప్పులు లేకుండానే పొలంలో నడుస్తున్నారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరం. ఎరువులు, పురుగు మందుల ప్రభావంతో పలు రసాయనాలు మట్టిలో కలిసిపోయి ఉంటాయి. నేలలోని గాజు ముక్కల్లాంటివి గుచ్చుకునే ప్రమాదమూ ఉంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ రావొచ్చు. ఏ పాద రక్షల దుకాణానికి వెళ్లినా ఆఫీస్‌కు, ఆటలకు కావాల్సిన షూస్ దొరుకుతాయి. టాయిలెట్‌కు వెళ్తున్నప్పుడు వేసుకునే పాదరక్షలూ లభిస్తాయి. కానీ, రైతులు పొలానికి వేసుకెళ్లేందుకు మాత్రం లేనే లేవు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నాం. రబ్బరు, తోలు, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా స్థానికంగా దొరికే పీచుతోనే రైతులకు పాదరక్షలు అందించాలని భావించాం. అరటి నార, జనపనార, కొబ్బరి పీచు వంటి పదిహేను రకాలను పరిశీలించాం. కానీ ఇవేవీ బురదలో పనికిరావు. ఆ లక్షణాలు గొంగడిలో ఉన్నాయని అనిపించింది. గొంగడి చల్లని వాతావరణంలో కూడా వెచ్చగా ఉంచుతుంది. ఆ ఉన్నితో రైతులకు బూట్లు తయారు చేయాలనుకున్నాం. కానీ, బూట్ల తయారీకి ఉన్ని అనుకూలం కాదు. అయినా నిరాశపడకుండా.. చివరికి ఓ ఫార్ములా రూపొందించాం. మా ప్రయత్నాన్ని నిపుణులు సైతం మెచ్చుకున్నారు.
సిటీ వాళ్లకూ..
మా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్‌లో ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. గొంగడితో బూట్ల నమూనా, అభివృద్ధి.. అంతా అక్కడే చేశాం. చెన్నైలోని జాతీయ తోలు పరిశోధన సంస్థలో పరీక్షలు నిర్వహించాం. అక్కడ ఆమోదముద్ర వేయించుకున్న తర్వాతే.. ‘యార్’ బ్రాండ్ గొంగడి షూస్ మార్కెట్లో విడుదల చేశాం. గొంగడితో రెండు రకాల షూస్ మార్కెట్లోకి తీసుకొచ్చాం. ఒకటి గ్రామాల్లోని వారి కోసం, మరొకటి పట్టణ ప్రజల కోసం. ఈ రెండూ ఒకే డిజైన్. కానీ, ఉపయోగించే ఉన్నిలో తేడా ఉంది. రైతు బూట్లకు దక్కన్ ఉన్ని గొంగడిని, పట్టణాల్లో ఉపయోగించేవాళ్ల కోసం హిమాచల్ ప్రదేశ్ ఉన్ని గొంగడిని ఎంచుకున్నాం.
మరిన్ని మాడల్స్
యార్ షూస్‌కు మంచి డిమాండ్ బావుంది. కానీ, ఒకే రకమైన షూ అందరు రైతులకూ ఉపయోగపడదు. పాము కాటు నుంచి కాపాడుకునేందుకు వినూత్నమైన డిజైన్ తీసుకొస్తున్నాం. మహిళా రైతులకు కోసం కూడా కొత్త మాడల్ తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం. వ్యవసాయంలో అన్ని రకాల సాగు పద్ధతులకు అనువుగా అనేక రకాల మోడల్స్ తీసుకురావాలన్నది మా పట్టుదల. త్వరలోనే రైతులందరి అవసరాలు తీరుస్తాం. ఇదంతా మా దృష్టిలో వ్యాపారం కాదు. ఓ బాధ్యత. ఆకలి నుంచి మనకు రక్షణ కల్పించే అన్నదాత రుణం తీర్చుకునే అరుదైన అవకాశం. ఒక్క పాదరక్షలతోనే మా బాధ్యత తీరిపోయిందనీ అనుకోవడం లేదు. అనేకానేక ప్రకృతి విపత్తులనుంచి అతడిని కాపాడే ఉపకరణాలనూ అందిస్తాం.
సమాజానికి ఉపయోగపడేలా..
సంతోష్ కొచ్చర్లకోట (హైదరాబాద్), నకుల్ లాట్కర్ (నాందేడ్, మహారాష్ట్ర), విద్యాధర్ బండారే (కొల్ల్లాపూర్, మహారాష్ట్ర) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అహ్మదాబాద్‌లో చదువుకున్నారు. ముగ్గురూ క్లాస్మేట్స్. 2017లో చదువు పూర్తి చేశారు. “పెద్ద కంపెనీల్లో, మంచి జీతంతో ఆఫర్ వచ్చినా వద్దనుకున్నాం. మంచి ఆలోచనతో సమాజానికి ఉపయోగపడేలా ఓ కంపెనీ పెట్టాలనుకున్నాం. 2019లో ఎర్త్ అండ్ ట్యూన్స్ డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించాం. గతంలో, నేను ఎలక్ట్రిక్ వీల్ చెయిర్ రూపొందించాను. మా టీమ్ సభ్యుడు విద్యాధర్ ఇండియన్ రైల్వే శాఖ కోసం సురక్షితమైన సీట్లు డిజైన్ చేశాడు. ఇలా సమాజానికి ఉపయోగపడేవి చేయాలనుకున్నాం. అవే చేస్తున్నాం” అంటున్నాడు వ్యవస్థాపక సభ్యుడు సంతోష్.
Read More :
“రైతులకు అండగా తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.. వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా”
“Sai Chinmayi | ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

