India vs Afghanistan Test | 152 పరుగులకు ఆలౌట్ అయిన ఆప్గనిస్తాన్ ..6 వికెట్లతో సత్తా చాటిన మానవ్ సుతార్
India vs Afghanistan Test | న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో(Afghanistan) జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో(Test match) తొలి ఇన్నింగ్స్‌లో ఆప్గనిస్తాన్ 152 పరుగులకు ఆలౌట్ అయింది.
హైదరాబాద్ : న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో(Afghanistan) జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో(Test match) తొలి ఇన్నింగ్స్‌లో 58.4 ఓవర్లలో ఆప్గనిస్తాన్ 152 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరంగేట్రం మ్యాచ్‌లోనే మానవ్ సుతార్ 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో ఆప్గాన్ 152 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో రహ్మత్ షా(60) ఒక్కడే రాణించాడు. ప్రసిద్ధ్ క్రిష్ణ 3వికెట్లు తీసుకోగా వాషింగ్టన్ సుందన్ ఒక వికెట్ తీశాడు. స్వల్ప స్కోరుకే పరిమితమైన ఆప్గాన్ను ఇండియా ఫాల్‌ఆన్‌కు ఆహ్వానించింది. 412 పరుగుల లోటుతో సెకండ్ ఇన్సింగ్స్ ఆరంభించిన ఆ జట్టు 4 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 18 పరుగులు చేసింది.
కాగా, న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో(Afghanistan) జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో(Test match) శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సాధించిన శతకాలతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. శుభ్‌మన్ గిల్ (177 బంతుల్లో 126, 15ఫోర్లు, 1సిక్స్), కేఎల్ రాహుల్(100), సెంచరీలు సాధించగామూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సాయి సుదర్శన్ (81), రిషబ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్(52) అర్ద శతకాలతో ఆకట్టుకున్నారు.
అఫ్గానిస్థాన్ బౌలర్లలో సలీమ్ సాఫి 6 వికెట్లతో చెలరేగాడు. రెహమాన్ షరీఫీ, హష్మతుల్లా షాహిదీ తలొక వికెట్ పడగొట్టారు. కాగా, బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై లభించిన అవకాశాన్ని యశస్వి జైస్వాల్సద్వినియోగం చేసుకోలేకపోయాడు.సఫీ బౌలింగ్‌లో (24) పరుగులకే వెనుదిరిగాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
Gang Rape | మహిళపైనా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

