Fruit Carving | ఫ్రూట్ కార్వింగ్, వెజిటబుల్ కార్వింగ్లాంటి పదాలు వింటే ఇదేదో మనకు సంబంధించిన విషయం కాదనిపిస్తుంది. ఎంతో జాగ్రత్తగా, మరింత అందంగా పండునో కూరగాయనో డిజైన్ చెక్కడమంటే మాటలు కాదు! కానీ ముచ్చటగా కనిపించేలా, మనం కూడా చేసుకోగలిగేలా కొన్ని ఫ్రూట్ అండ్ వెజిటబుల్ డెకరేషన్లు ఉన్నాయి. రకరకాల జంతువుల ఆకృతుల్ని కూరగాయలూ, పండ్లతో చేయడం ఇందులోని ప్రత్యేకత.
అతిథులు వచ్చినప్పుడు ఆహారం తయారీ మీద ఎంత శ్రద్ధ పెడతామో, దాన్ని డైనింగ్ టేబుల్ మీద అందంగా సర్దడం మీద కూడా అంతే శ్రద్ధ పెడుతున్నారిప్పుడు. ఫంక్షన్ల సమయంలో కార్వింగ్ నిపుణులు చూడముచ్చటగా రకరకాల ఆకృతుల్ని పండ్లు, కూరగాయలతోనే తీర్చిదిద్ది ప్రదర్శనగా పెడతారు. కానీ అంత కళ అందరికీ రాదు. అంత గొప్పగా అలంకరించేందుకు గంటల కొద్దీ సమయమూ ఉండదు. అందుకే చాలా సులభంగా చేయగలిగేలా, చూడగానే ముచ్చటగా అనిపించేలా రకరకాల జంతువుల్ని తయారు చేసి చూపిస్తున్నారు ఆధునిక కళాకారులు. అవే ఇవన్నీ..

Fruit Carving1

Fruit Carving2

Fruit Carving3

Fruit Carving4

Fruit Carving5

Fruit Carving6

Fruit Carving7

Fruit Carving8

Fruit Carving9l

Fruit Carving10

Fruit Carving11

Fruit Carving12

Fruit Carving14

Fruit Carving13
Smart Watch | ఇప్పుడు స్మార్ట్ వాచీలు మరింత స్మార్ట్‌గా అయిపోయాయ్!!
Pen Kalamkari | మగువలనే కాదు.. మగాళ్లనూ ఆకట్టుకునే పెన్ కలంకారీ ఇప్పుడు హాటెస్ట్ ట్రెండ్!