Pumpkin Festival | అమెరికాలో ఆరో అతిపెద్ద ఫెస్టివల్ అయిన గుమ్మడికాయల పండుగ గురించి ఈ విషయాలు తెలుసా !
Pumpkin Festival | ‘అమెరికా అంటేనే.. చిత్రవిచిత్రమైన వేడుకలకు నిలయం. అలాంటి పండుగల్లో ఒకటి.. గుమ్మడికాయల మహోత్సవం. గత ఏడాది ఆ దేశానికి వెళ్లినప్పుడు ఈ వింత వేడుకను చూశాం. అవ్యక్తానుభూతికి లోనయ్యాం’ అంటున్నారు పంతంగి శ్రీనివాసరావు. అమెరికాలో నిర్వహించే వేడుకల్లో.. గుమ్మడికాయల పండుగ ఆరో అతిపెద్దది.
Pumpkin Festival | ‘అమెరికా అంటేనే.. చిత్రవిచిత్రమైన వేడుకలకు నిలయం. అలాంటి పండుగల్లో ఒకటి.. గుమ్మడికాయల మహోత్సవం. గత ఏడాది ఆ దేశానికి వెళ్లినప్పుడు ఈ వింత వేడుకను చూశాం. అవ్యక్తానుభూతికి లోనయ్యాం’ అంటున్నారు పంతంగి శ్రీనివాసరావు. అమెరికాలో నిర్వహించే వేడుకల్లో.. గుమ్మడికాయల పండుగ ఆరో అతిపెద్దది. వివిధ ప్రాంతాల్లో సంప్రదాయబద్ధంగా జరిగే ఈ ఉత్సవాన్ని ఏటా నాలుగు లక్షలకు పైగా ప్రజలు తిలకిస్తారని అంచనా. మేము అట్లాంటాకు 65 మైళ్ల దూరంలో ఉన్న ‘అమికోలా వాటర్ ఫాల్స్’ దగ్గర ఈ మహోత్సవాన్ని సందర్శించాం.
ఇలా మొదలు..
1903 అక్టోబర్‌లో ‘మేయర్ జార్జ్ ఆల్. హోస్వెన్’ అనే వ్యక్తి ఈ వేడుకను తొలిసారిగా నిర్వహించాడు. తన దుకాణం ఎదుట కొన్ని గుమ్మడికాయలతో ఒక ప్రదర్శన ఏర్పాటుచేశాడు. దాదాపు 30వేల మంది ఈ వేడుకను తిలకించారట. అప్పటినుంచీ ఏటా అక్టోబర్‌లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. నాలుగు రోజులపాటు జరిగే ఈ వేడుక కోసం అమెరికా ప్రజలుఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సాధారణంగా ఏటా అక్టోబర్ మూడో బుధవారం రోజున ఆరంభమవుతుంది. శనివారంతో ముగుస్తుంది. ఇది పూర్తిగా ఉచిత ప్రదర్శన. ఎలాంటి ప్రవేశ రుసుమూ ఉండదు. అందరూ ఆహ్వానితులే.

Pumpkin2
అందాల పోటీలు..
అమెరికాలో గుమ్మడికాయల సాగు ఎక్కువ. కొందరు రైతులు భారీ పరిమాణంలో పండిస్తే.. ఇంకొంతమంది వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దుతుంటారు. వారంతా తమ గుమ్మడికాయలను ఈ వేడుకలో ప్రదర్శిస్తారు. అమ్మకాలు కూడా కొనసాగిస్తారు. వేడుక ప్రారంభానికి ముందు సోమవారం.. ఇక్కడికి వచ్చిన గుమ్మడికాయలను తూకం వేస్తారు. ఆకృతులను బట్టి ప్రదర్శనకు ఉంచుతారు. గుమ్మడికాయల పోటీలు కూడా నిర్వహిస్తారు. గెలుపొందిన గుమ్మడికాయకు.. ‘మిస్ పంప్కిన్’ అవార్డు అందజేస్తారు. అంతేకాకుండా, అతి బరువైన గుమ్మడికాయకు ప్రత్యేక బహుమతి ప్రకటిస్తారు. 2017లో నిర్వహించిన వేడుకలో ఒక గుమ్మడికాయ 1,072 కిలోల బరువు తూగింది. అదే.. అతిపెద్ద గుమ్మడికాయగా రికార్డులకు ఎక్కింది. దీనిని లోయల్ హాలెండ్‌లో ప్రదర్శనకు ఉంచారు.

Pumpkin3
జోరుగా విక్రయాలు..
పండుగలో భాగంగా గుమ్మడికాయల ప్రదర్శనతోపాటు, అమ్మకాలూ జోరుగా సాగుతాయి. రైతులు తీసుకొచ్చిన వివిధ ఆకృతుల గుమ్మడికాయలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడతారు. గుమ్మడి విత్తనాలను కూడా అమ్మకానికి పెడతారు. ఇందుకు స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా వచ్చే లాభాలను ‘పంప్కిన్ షో కార్పొరేషన్’ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. సందర్శకుల కోసం ఇక్కడ అనేక ఫుడ్‌కోర్ట్స్ ఏర్పాటుచేస్తారు. వీటిలో గుమ్మడికాయలతో చేసిన వివిధ రకాల వంటకాలను వండి వడ్డిస్తారు. డోనట్స్, పాన్‌కేక్స్, బర్గర్, కుకీలు, లడ్డూలు ప్రత్యేకంగా తయారుచేస్తారు. వీలైతే మీరూ ఈ కూష్మాండోత్సవానికి వెళ్లిరండి.

Pantangi Srinivasarao
మధురానుభూతులు..
గత అక్టోబర్‌లో అట్లాంటాలో ఉంటున్న మా అబ్బాయి దగ్గరికి వెళ్లాం. ఆ సమయంలోనే.. ‘అమికోలా వాటర్ ఫాల్స్’ను సందర్శించి.. తిరుగు ప్రయాణంలో ఈ గుమ్మడికాయల
పండుగలో పాల్గొన్నాం. గుమ్మడికాయల దొంతర మధ్య నడుస్తూ.. మేమూ చిన్నపిల్లలమయ్యాం. చిత్రవిచిత్రమైన వేడుకలో భాగస్వాములమై.. ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మధురానుభూతిని మూటగట్టుకున్నాం.
– పంతంగి శ్రీనివాసరావు
Read More :
“Clearwater Beach | అమెరికాలోని ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే..”
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

