Pre Wedding Shoot | ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ చేయించుకుంటున్నారా? హైదరాబాద్‌లోనే ఉన్న ప్రత్యేకమైన ఈ స్పాట్స్ గురించి ఐడియా ఉందా?
Pre Wedding Shoot | పెండ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే తీయని వేడుక. ఆ సంబురానికి సంబంధించిన జ్ఞాపకాలు భద్రంగా ఉండాలి కదా! అందుకో మార్గం ఉంది.. ఫొటోషూట్. అయితే.. ఈ మధ్య ఫొటోషూట్ల ట్రెండ్ మారింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, కపుల్ షూట్ తప్పనిసరి అయిపోయాయి.
Pre Wedding Shoot | పెండ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే తీయని వేడుక. ఆ సంబురానికి సంబంధించిన జ్ఞాపకాలు భద్రంగా ఉండాలి కదా! అందుకో మార్గం ఉంది.. ఫొటోషూట్. అయితే.. ఈ మధ్య ఫొటోషూట్ల ట్రెండ్ మారింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, కపుల్ షూట్ తప్పనిసరి అయిపోయాయి. సినిమాను తలపించే లైటింగ్, ఎఫెక్ట్స్, సెట్టింగులతో ఫొటోషూట్లు నిర్వహిస్తున్నారు. వీటికోసం ప్రత్యేకమైన స్పాట్లు వస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ చాలానే ఉన్నాయి.

మాయాబజార్: ఈ ఫొటోషూట్ స్పాట్లో 25 రకాల సెట్టింగులు ఏర్పాటు చేశారు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఇక్కడ రాయల్ ప్యాలెస్ సెట్లు, వాల్ మ్యూరల్స్, గోపురాలు ఉన్నాయి. పేరుకు తగ్గట్టే మాజాబజార్లాంటి షూటింగ్ స్పాట్.

ఫొటో గ్యారేజ్: పదెకరాల విస్తీర్ణంలో అజీజ్ నగర్లో అభివృద్ధిచేసిన స్టూడియో ఇది. ఇక్కడ ఇండోర్ సెట్లు, ఔట్‌డోర్ సెట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 30 ఔట్‌డోర్ సెట్టింగులు ఏర్పాటుచేశారు. వెరైటీ ఐడియాలతో ఈ ఫొటోషూట్ స్టూడియో డిజైన్ చేశారు.

ద షూటింగ్ స్పాట్: రకరకాల నేపథ్యాలతో ఫొటోషూట్ చేసుకునే సౌకర్యం ఇక్కడ ఉంది. మొత్తం 45 రకాల బ్యాక్‌డ్రాప్‌లలో ఫొటోషూట్ చేసుకోవచ్చు. నైట్ ఫొటోషూట్ కోసం స్టూడియో అద్దెకు కూడా ఇస్తారు.

ఎలిమెంట్స్ ఫస్ట్: హైదరాబాద్‌లోని ఎక్స్‌క్లూజివ్ ఫొటోషూట్ స్పాట్లలో ఇదొకటి. దీన్నే నవాబ్స్ గార్డెన్ అని కూడా పిలుస్తారు. ఒక్క టికెట్‌తో 8మందిని లోపలికి అనుమతిస్తారు.

నేచర్స్ రే స్టూడియోస్: నాగార్జునసాగర్ హైవే మీదుగా వెళ్తుంటే ఇబ్రహీంపట్నంలో ఈ స్టూడియో ఉంది. 8 ఎకరాల్లో నిర్మించారు. హిల్ వ్యూ సెట్, మౌంటెన్ వింగ్స్ సెట్, పుష్పక
విమానం, రాక్ డ్రిల్, విలేజ్ సెట్, వుడెన్ హౌజ్, లైట్ రూమ్, లండన్ స్ట్రీట్ ఇలా రకరకాల సెట్స్‌లో ఫొటోషూట్ చేసుకోవచ్చు.

మరికొన్ని..
ద డ్రామాలాండ్, పిక్చర్స్క్యూ స్టూడియోస్, పిక్చర్ సిటీ, హ్యాష్‌ట్యాగ్ స్టూడియోస్, ద ఛాయాచిత్రం స్టూడియోస్, పిక్చర్స్క్యూ నెక్ట్స్, ఇమాజికా స్టూడియోస్, హిడెన్ క్యాజిల్ రిసార్ట్, ప్రగతి రిసార్ట్స్, లియోనియా హోలిస్టిక్ రిసార్ట్, ఢోలా రి ధని ఇలా ప్రత్యేకంగా ఫొటోషూట్ కోసమే ఈ స్టూడియోలు నిర్మించారు.

ఇవే కాదు.. హైదరాబాద్‌లో ఫొటోషూట్ల కోసం చాలా స్పాట్లు ఉన్నాయి. అందులో కొన్ని ఫ్రీ లొకేషన్లు అయితే.. కొన్ని స్టూడియోలకు మాత్రం డబ్బు చెల్లించాల్సిందే. రోజుకు తక్కువలో తక్కువ ఒక్కో లొకేషన్‌కు రూ.15,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అక్కడి సౌకర్యాలు, వసతులను బట్టి ధరల్లో తేడా ఉంటుంది. ఇక ఉచిత సేవలు కావాలంటే.. అమీన్పూర్ చెరువు, గోల్కొండ కోట, తారామతి బారాదరి, లోటస్ పాండ్ తదితర వేదికలు ఉండనే ఉన్నాయి. ఎంపిక మీ ఇష్టం.




Read More :
“నిన్నటి దాకా ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్.. ఇప్పుడేమో నయా ట్రెండ్.. అసలేంటిది?”
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

