పెళ్లంటే పెద్ద పండుగ. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్, పెళ్లి కార్డులు ప్రింట్ చేసి అందరికీ పంచడం.. పెళ్లికి ఫంక్షన్ హాల్ మాట్లాడటం, క్యాటరింగ్, షాపింగ్.. అబ్బో.. పెళ్లి అంటే చాలు.. ఇవన్నీ ఉంటాయి. అందుకే పెళ్లిని పండుగతో పోల్చుతుంటారు. పెళ్లికి ఓ పది పదిహేను రోజుల ముందు నుంచే ఇవన్నీ ఉంటాయి.
ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షూట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్‌లో పెళ్లికూతురు, పెళ్లికొడుకు చేసే చిలిపి పనులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సాధారణంగా ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే.. ఏదైనా పార్కులోనో.. లేదా ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని తీస్తారు కానీ.. ఈ పెళ్లి కూతురు మాత్రం తన ప్రీ వెడ్డింగ్ షూట్‌ను ఏకంగా జిమ్‌లో పెట్టుకుంది.
జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఫోటోలు దిగింది. అయితే.. తను కసరత్తులు చేస్తూ ఫోటోలు దిగుతుంటే.. తనకు కాబోయే వరుడు మాత్రం అక్కడ కనిపించలేదు. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెయిట్ లిఫ్టింగ్ చేయడం.. డంబెల్స్ ఎత్తడం లాంటివి చేసి పెళ్లికూతురు అందరినీ ఆకట్టుకుంది. పెళ్లి కూతురు గెటప్‌లో వచ్చి.. ఇలా బాడీ బిల్డర్‌లా కసరత్తులు చేయడం ఏంటని.. నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. తన కొత్త ఆలోచనకు నెటిజన్లు జోహార్లు అంటున్నారు. కానీ.. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పరిస్థితి ఏంటో.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
చిందరవందరగా బెడ్రూమ్.. కాంపిటిషన్లో గెలిచిన 8 ఏళ్ల బాలిక.. ఫోటోలు వైరల్
వరద నీటిలో నడవడం కోసం భలే ఐడియా.. నువ్వు తోపు అంటున్న నెటిజన్లు
నడవడం ఇష్టం లేక అంబులెన్స్‌కు ఫోన్.. 39 సార్లు ఫ్రీ ట్యాక్సీలా వాడుకున్నాడు
నచ్చిన ఫుడ్ తినడం కోసం 8000 రెస్టారెంట్లు తిరిగాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?