e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News చింద‌ర‌వంద‌ర‌గా బెడ్‌రూమ్‌.. కాంపిటిష‌న్‌లో గెలిచిన 8 ఏళ్ల బాలిక‌.. ఫోటోలు వైర‌ల్‌

చింద‌ర‌వంద‌ర‌గా బెడ్‌రూమ్‌.. కాంపిటిష‌న్‌లో గెలిచిన 8 ఏళ్ల బాలిక‌.. ఫోటోలు వైర‌ల్‌

టైటిల్ చేసి క‌న్ఫ్యూజ్ అయిన‌ట్టున్నారు క‌దా. సాధార‌ణంగా పిల్ల‌ల బెడ్‌రూమ్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఎక్క‌డి వ‌స్తువులు అక్క‌డే ప‌డేసి.. చింద‌ర‌వంద‌ర‌గా ఉంటుంది బెడ్‌రూమ్. పిల్ల‌ల‌కు వ‌స్తువుల‌ను స‌రిగ్గా స‌ర్దుకోవ‌డం తెలియ‌క‌.. తెలిసినా కూడా స‌మ‌యం లేక‌.. ఇలా ప‌లు కార‌ణాల వ‌ల్ల‌.. బెడ్‌రూమ్ గ‌జిబిజిగా ఉంటుంది. అందుకే పిల్ల‌ల బెడ్‌రూమ్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌నివాళ్లు కానీ.. త‌ల్లి కానీ స‌ర్దుతుంటారు. అయిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ బెడ్‌రూమ్ ప‌రిస్థితి అలాగే ఉంటుంది.

తాజాగా.. 8 ఏళ్ల ఓ బాలిక బెడ్‌రూమ్ యూకేలోనే అత్యంత చింద‌ర‌వంద‌ర‌గా ఉన్న బెడ్‌రూమ్‌గా కాంపిటిష‌న్‌లో విన్ అయింది. అయ్ బాబోయ్.. బెడ్‌రూమ్ చింద‌ర‌వంద‌ర‌గా ఉంటే ప్రైజ్ కూడా ఇస్తారా? అని నోరెళ్ల‌బెట్ట‌కండి. యూకేలో అత్యంత చింద‌ర‌వంద‌ర‌గా ఉండే పిల్ల‌ల బెడ్‌రూమ్‌పై కాంపిటిష‌న్ నిర్వ‌హించారు. అందులో 8 ఏళ్ల బాలిక బెడ్‌రూమ్ ఎంపికైంది.

- Advertisement -

గ్లాస్‌గోకు చెందిన ఎమిలీ బెడ్‌రూమ్‌ను ఫోటో తీసి త‌న త‌ల్లిదండ్రులు కాంపిటిష‌న్‌కు పంపించారు. హ్యాపీ బెడ్స్ అనే ఓ సంస్థ ఈ కాంపిటిష‌న్‌ను నిర్వ‌హించింది. ఆ కాంపిటిష‌న్‌కు 100కు పైగా ఎంట్రీలు రాగా.. ఎమిలీ బెడ్‌రూమ్‌నే నిర్వాహ‌కులు ఎంపిక చేశారు. అత్యంత గంద‌ర‌గోళంగా ఉన్న బెడ్‌రూమ్‌గా పోటీలో గెలిచినందుకు ఎమిలీకి 400 పౌండ్ల బ‌హుమ‌తిని కూడా అంద‌జేశారు. అంటే మ‌న క‌రెన్సీలో రూ.40 వేలు అన్న‌మాట‌.

ఇక.. ఆ కాంపిటిష‌న్‌లో కాంప్లిమెంట‌రీ బ‌హుమ‌తులు పొందిన మ‌రికొంద‌రు పిల్ల‌ల ఫోటోల‌ను కూడా ఆ సంస్థ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాళ్ల‌కు కూడా కొంత అమౌంట్‌ను బ‌హుమ‌తిగా అంద‌జేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

వ‌ర‌ద నీటిలో న‌డ‌వ‌డం కోసం భ‌లే ఐడియా.. నువ్వు తోపు అంటున్న నెటిజ‌న్లు

న‌డ‌వ‌డం ఇష్టం లేక‌ అంబులెన్స్‌కు ఫోన్.. 39 సార్లు ఫ్రీ ట్యాక్సీలా వాడుకున్నాడు

రియ‌ల్ లైఫ్ స్క్విడ్ గేమ్.. యూట్యూబ‌ర్ సృష్టి.. విన్న‌ర్‌కు రూ.3.4 కోట్ల ప్రైజ్ మ‌నీ.. వీడియో వైర‌ల్‌

న‌చ్చిన ఫుడ్ తిన‌డం కోసం 8000 రెస్టారెంట్లు తిరిగాడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement