CarterX | విమాన ప్రయాణంలో సుఖం ఉంది. గాల్లో తేలిపోయి.. గంటల వ్యవధిలో దేశ విదేశాల్లో విహరించవచ్చు. కానీ, లగేజ్ దగ్గరికి వచ్చేసరికి చిరాకు మొదలవుతుంది. ప్రయాణం కంటే ఎక్కువ సమయం.. లగేజీ క్యూలోనే గడిచిపోతుంది. అలాంటి సమస్యలు లేకుండా మన లగేజ్‌ను నేరుగా ఇంటికి చేరుస్తుంది కార్టర్‌ఎక్స్.
మనం ఎంత వేగంగా గమ్యాన్ని చేరుకున్నా.. లగేజ్ దగ్గర వెయిట్ చేయడం వల్ల సమయం వృథా అవుతుంది. వేలకువేలు పోసి విమానం టికెట్ కొన్నా కూడా ఉపయోగం లేకుండాపోతుంది. ఇక, అత్యవసరమైన పని ఉంటే అంతే సంగతులు. ట్రాలీలో బరువైన లగేజ్ మోసుకెళ్లలేక ఇబ్బందిపడేవారూ ఉంటారు. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నది.. కార్టర్‌ఎక్స్. ఒక్క క్లిక్ చాలు. మన బ్యాగేజ్‌ను ఎయిర్‌పోర్ట్‌కు.. అట్నుంచి గమ్యస్థానానికి తీసుకెళ్లాల్సిన తలనొప్పి ఉండదు. ఆ బాధ్యత కార్టర్‌ఎక్స్ తీసు కుంటుంది.
కార్టర్‌ఎక్స్ బెంగళూరుకు చెందిన స్టార్టప్. దీని ఫౌండర్ కమ్ సీయీవో హర్షవర్ధన్. రమ్యారెడ్డి కో-ఫౌండర్. దేశంలో ఈ తరహా సేవలు అందిస్తున్న ఏకైక డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఇదే. విమానాశ్రయం నుంచి లగేజీ నేరుగా ఇంటికి తీసుకురావడం, ఇంటినుంచి విమానాశ్రయానికి చేర్చడం ఈ స్టార్టప్ ప్రత్యేకత. ఐదేండ్ల క్రితం.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా సేవలు ప్రారంభించారు. తమమీద తమకు నమ్మకం కలిగాక.. హైదరాబాద్‌లో మొదలు పెట్టారు. ఆ తర్వాత ముంబై ఎయిర్‌పోర్ట్‌కు విస్తరించారు. ఆపైన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోనూ పాగా వేశారు. ఈ నాలుగు ఎయిర్‌పోర్ట్‌లలో కలిపి కార్టర్‌ఎక్స్ ద్వారా ఏటా వేలమంది ప్రయాణికులు సేవలు పొందుతున్నారు. త్వరలోనే కార్టర్‌ఎక్స్ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు హర్షవర్ధన్.
రమ్యారెడ్డి ఒకసారి సైకిల్ టూర్ వెళ్లారు. ఇంటినుంచి గమ్యస్థానానికి చేరేలోపే ఆమె లగేజ్ సజావుగా ఇంటికి చేరవేసిన విషయం తెలిసి హర్షఆశ్చర్యపోయారు. అప్పుడే, స్లాట్ ఆధారిత పికప్, డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నారు. కార్టర్‌ఎక్స్ ద్వారా ఎయిర్‌లైన్ ప్యాసింజర్ సేవలు ప్రవేశపెట్టారు.
కార్టర్‌ఎక్స్ అందించే సేవల్లో ముఖ్యమైనది బ్యాగేజ్ బదిలీ. ఇంటర్సిటీ, ఇంట్రాసిటీ డెలివరీ ఆప్షన్స్ ఉంటాయి. బ్యాగేజ్ చెక్-ఇన్ సర్వీస్ కోసం కార్టర్‌ఎక్స్ వివిధ విమానయాన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఎయిర్‌పోర్ట్‌లోనే కాదు, మన గడప దగ్గర కూడా చెక్-ఇన్ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా ఎయిర్పోర్ట్ తనిఖీ నిబంధనలకు లోబడి ఉంటుంది. భద్రత ప్రొటోకాల్‌ను అనుసరించి.. ప్రయాణికులు టెర్మినల్‌లోకి వెళ్లే సమయానికి బ్యాగేజ్ విమానంలో ఉండేట్లు చూస్తారు. అయితే, ప్రతీ బ్యాగేజ్ 32 కిలోలకు మించి ఉండకూడదు. ఎంచుకున్న సర్వీస్ ఆధారంగా ఒక్కో బుకింగ్‌కు గరిష్ఠంగా ఎనిమిది బ్యాగ్‌లకు అనుమతి ఇస్తారు. నాన్ ఎయిర్పోర్ట్ సేవల కోసం ప్రతి బుకింగ్‌లో ఒక పార్సిల్‌కు అనుమతి ఉంటుంది. బ్యాగుల సంఖ్య, లొకేషన్ నుంచి ఎయిర్పోర్ట్ మధ్య దూరం తదితర అంశాల ఆధారంగా చార్జీలు నిర్ణయిస్తారు.
యూకేలో Airportr, దుబాయ్‌లో DUBZ వంటి సంస్థలు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. రమ్యారెడ్డి ఒకసారి సైకిల్ టూర్ వెళ్లారు. ఇంటినుంచి గమ్య స్థానానికి చేరేసరికి.. ఆమె లగేజ్ సజావుగా ఇంటికి వచ్చిన విషయం తెలిసి హర్షవర్ధన్ ఆశ్చర్యపోయారు. అప్పుడే, స్లాట్ ఆధారిత పికప్-డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుంది అనుకున్నారు. కార్టర్‌ఎక్స్ ద్వారా ఎయిర్‌లైన్ ప్యాసింజర్ సేవలు ప్రవేశపెట్టారు. సామాన్లను ట్రాక్ చేయడానికి, ఆర్డర్ ప్రాసెస్, డెలివరీ కోసం ఉదయం నుంచి రాత్రి వరకు కాల్ సెంటర్ సేవలు కూడా నడుస్తున్నాయి. వివిధ వెంచర్ క్యాపిటల్ సంస్థలు ఈ స్టార్టప్‌లో పెట్టుబడి పెట్టాయి. మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశమూ ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) డాటా ప్రకారం.. 2024 నాటికి భారతీయ విమానయానం, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌గా అవతరిస్తుందనీ.. బ్యాగేజ్ వ్యాపారం
8-10 శాతం పెరుగుతుందని అంచనా. ఇంకేముంది, హర్షవర్ధన్ పంట పండినట్టే!
“On Her Way | అమ్మాయిలూ.. ఒంటరిగా టూర్ వెళ్లాలని అనుకుంటున్నారా? ఇది మీకోసమే”