No Rain Village | ఈ గ్రామమే ఒక అద్భుతం.. ఇక్కడ వర్షం పడదు.. కానీ మేఘాలను చేతితో తాకవచ్చు
No Rain Village | అస్సలు వర్షాలే కురవని ఒక గ్రామం భూమి మీద ఉందన్న విషయం తెలుసా.. అవునండీ యెమెన్ ( Yemen ) దేశంలో ఉన్న అల్ హుతైబ్ ( Al -hutaib ) గ్రామంలో సంవత్సరం మొత్తంలో ఒక్కసారి కూడా వర్షం పడదు.
No Rain Village | ఈ భూమ్మీద ఒక్కో చోట ఒక్కో వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఎండలు మండిపోతే.. మరికొన్ని చోట్ల మంచు కప్పేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చలి వణికిస్తే.. మరికొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి వర్షాలు కురుస్తూనే ఉంటాయి. ఇలా ఒక్కో చోట ఒక్కో వాతావరణ పరిస్థితి ఉంటుంది. కానీ అస్సలు వర్షాలే కురవని ఒక గ్రామం భూమి మీద ఉందన్న విషయం తెలుసా.. అవునండీ యెమెన్ ( Yemen ) దేశంలో ఉన్న ఒక గ్రామంలో సంవత్సరం మొత్తంలో ఒక్కసారి కూడా వర్షం పడదు.
వర్షం ఎందుకు పడదంటే..
యెమెన్ రాజధాని సనాకు పశ్చిమ దిశలో అల్ హుతైబ్ ( Al -hutaib ) అనే గ్రామం ఉంది. ఇది భూ ఉపరితలానికి 3200 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది మేఘాలు ఉండే ప్రాంతానికంటే కూడా ఎత్తు అన్నమాట. అంటే.. ఈ గ్రామంలో మేఘాలు మన కాళ్ల కింద ఉంటాయి. వీటిని ఈజీగా చేతులతో తాకొచ్చు. మేఘాల కన్నా ఎత్తులో ఈ గ్రామం ఉంది కాబట్టే ఇక్కడ ఎప్పుడూ వర్షం కురవదు. వర్షాలు పడకపోవడం ఒక్కటే కాదు అల్ హుతైబ్ గ్రామంలో వాతావరణం పూర్తిగా డిఫరెంట్‌గానే ఉంటుంది. ఉదయం సూర్యుడు ఉదయించేంత వరకు ఈ గ్రామాన్ని చలి కప్పేస్తుంది. సూర్యుడు ఉదయించగానే ఎండలు మండిపోతాయి. మళ్లీ సూర్యుడు అస్తమించగానే ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతాయి.

ఇక్కడి ప్రజలు ముంబై నుంచి వెళ్లినవాళ్లే..
అల్ హుతైబ్ గ్రామంలో అల్ బోహ్రా ( అల్ ముఖర్మ ) తెగలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. వీరిని యెమెన్ కమ్యూనిటీస్‌గా పిలుస్తారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. వీళ్లు మన ముంబై నుంచి వెళ్లినవాళ్లే. ముంబైకి చెందిన మహమ్మద్ బుర్హానుద్దీన్ నేతృత్వంలోని ఇస్మాయిలీ విభాగం నుంచి వచ్చి అల్ హుతైబ్‌లో స్థిరపడ్డారు.

టూరిస్ట్‌ల ఫేవరేట్ స్పాట్
మేఘాల కంటే ఎత్తులో ఉండటంతో ఈ వింతైన గ్రామం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. మేఘాలపై నిలబడి వర్షం భూమి మీద పడే సుందర దృశ్యాన్ని చూసేందుకు అల్ హుతైబ్ గ్రామానికి ఏటా వేలాది మంది టూరిస్టులు వస్తుంటారు. కొండపై నుంచి కిందకు వెళ్తూ వర్షా్న్ని తాకుతూ ఎంజాయ్ చేస్తుంటారు.
Read More :
Read Today's Latest Evergreen News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

