Polar Night | ఆ ఊళ్లో రెండు నెలల దాకా రాత్రిలాగే ఉంటుంది.. నెలలు గడిచినా సూర్యుడు రాని ప్రాంతాలివే..
Polar Night | ఆర్కిటిక్ వలయం పరిధిలోని కొన్ని ఊళ్లలో చలికాలాల్లో రోజుల తరబడి రాత్రే ఉంటుంది. నెలలు గడిచినా సూర్యోదయం కాదు. ఈ ప్రాంతంలోని ఒక ఊళ్లో రెండు నెలల పాటు రాత్రి ఉంటే, మరో ఊళ్లో నాలుగు నెలలూ చీకటే.
Polar Night | అక్కడ జామురాతిరి జాబిలమ్మ కేవలం జోలపాడటానికే కాదు మేలు కొలపడానికీ ఉంటుంది. పగలే వెన్నెల కురిపిస్తుంది. ఉదయ భానుణ్ని మరిపించే ప్రయత్నమూ చేస్తుంది. ఎందుకంటే ఆర్కిటిక్ వలయం పరిధిలోని కొన్ని ఊళ్లలో చలికాలాల్లో రోజుల తరబడి రాత్రే ఉంటుంది. నెలలు గడిచినా సూర్యోదయం కాదు. ఈ ప్రాంతంలోని ఒక ఊళ్లో రెండు నెలల పాటు రాత్రి ఉంటే, మరో ఊళ్లో నాలుగు నెలలూ చీకటే. అదెలా సాధ్యం… ఇదెక్కడి విచిత్రం అనుకుంటున్నారా… అయితే ఆ సుదీర్ఘ రాత్రుల కథ చదవండి…

చలికాలం వచ్చిందంటే చాలు, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా… ఎప్పుడెప్పుడు ఎండవేడికి చలి కాచుకుందామా అన్నట్టుగా ఉంటుంది.. సూర్యోదయం కోసం మన ఎదురుచూపు. కానీ నీళ్లు గడ్డకట్టుకుపోయే చలి ఉండే ఆ ప్రాంతాల్లో శీతాకాలాల్లో సూర్యుడి జాడే కనిపించదు. కాసేపైనా ఎండ దుప్పటి కప్పుకొని తిరిగే అవకాశమే వాళ్లకు దొరకదు. ‘పోలార్ నైట్ ( Polar Night )’గా పిలిచే ప్రకృతి వైచిత్రే దీనికి కారణం. ఒక రాత్రి 24 గంటల పాటు ఉంటే దాన్ని పోలార్ నైట్‌గా పిలుస్తారు.

భూమి తన అక్షం మీద ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందువల్ల ధ్రువాల దగ్గర ఉండే ఆర్కిటిక్ వలయం ప్రాంతంలోని కొన్ని ఊళ్లలో శీతాకాలం సూర్యుడి కాంతి ప్రసరించదు. ఆర్కిటిక్ వలయానికి ఆయా ఊళ్లు ఉన్న దూరాన్ని బట్టి ఆ ప్రదేశాల్లో ఏర్పడే రాత్రుల్లో తేడా ఉంటుంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాలు సహా స్వీడన్, కెనడా, గ్రీన్‌ల్యాండ్, రష్యా, నార్వే, ఫిన్లాండ్ దేశాల్లో ఈ తరహా పోలార్ నైట్లు ఏర్పడతాయి.

ఎక్కడెక్కడ…
సుదీర్ఘంగా సాగే ఈ రాత్రులు కొన్ని ప్రాంతాల్లో నెలలపాటు ఉంటాయి. అందులో అత్యంత ప్రాచుర్యం పొందిన నగరం.. అమెరికా దేశం అలాస్కా రాష్ట్రానికి చెందిన ఉట్కియాగ్విక్. మంచు కొండల మధ్య పొందికగా పేర్చినట్టుండే ఈ ఊళ్లో నవంబర్ 15 నుంచి 19 మధ్య కాలం వరకే సూర్యుడు కనిపిస్తాడు. తర్వాత మళ్లీ జనవరి 20 తర్వాతే ఉదయిస్తాడు. అంటే దాదాపు రెండు నెలలు అక్కడ పొద్దుపొడవదు. గతేడాది 65 రోజులకు పైగా సూర్యుడు దర్శనమే ఇవ్వలేదు. అలాగే నార్వే దేశంలోని ‘ట్రాంసో’ మున్సిపాలిటీ ప్రాంతంలో నవంబర్ చివరివారం నుంచి జనవరి మధ్య వరకూ సుదీర్ఘరాత్రి కొనసాగుతుంది.

నార్వేలోని స్వాల్బార్డ్లోనూ అక్టోబర్ తొలివారం నుంచి ఫిబ్రవరి చివరి వరకూ.. అంటే దాదాపు నాలుగు నెలలు రాత్రి మాత్రమే ఉంటుంది. అందులోనూ నవంబర్ మధ్యకాలం నుంచి దాదాపు రెండున్నర నెలలు ఈ ప్రాంతంలో చిమ్మచీకటి కమ్మి ఉంటుంది. అయితే ఒక్క స్వాల్బార్డ్ మినహా మిగతా ప్రాంతాల్లో చీకటి అంటే మనకు మధ్యరాత్రిలాగా కటిక చీకటి ఉండదు.

చంద్రుడూ, అధిక సంఖ్యలో ఉండే నక్షత్రాల వెలుతురుతో పాటు ఆకాశంలోని కాంతి నీళ్ల మీద పరావర్తనం చెంది.. సందెపొద్దును తలపించేలా అందమైన నీలి రంగు కాంతి దర్శనమిస్తుంది. మంచు, నీళ్లు ఉన్న ప్రాంతాలన్నీ ఇలా నీలివర్ణంలో ముంచినట్టు అద్భుతంగా మెరిసిపోతూ దర్శనమిస్తాయి. వీటికి తోడు అయనోస్పియర్‌లో సౌరవాయువులకు చెందిన అయాన్లు భూ వాతావరణంలోని ఆక్సిజన్, నైట్రోజన్ అణువులను ఢీకొట్టినకారణంగా ఆ ప్రాంతంలో రంగురంగుల్లో దర్శనమిచ్చే అరోరా బొరియాలిస్ కూడా కనువిందు చేస్తాయి. వీటన్నిటినీ కెమెరాలో బంధించడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రకృతిప్రియులు వస్తారు. సుదీర్ఘమైన రాత్రుల్ని అనుభూతి చెందుతారు.
Read More :
అర్ధరాత్రైనా ఇక్కడ పగల్లాగే ఉంటుంది.. సూర్యుడు అస్తమించని ప్రాంతాలివే..
శత్రువులను అడ్డుకోవాలన్న తపనలో.. పొరపాటున వాళ్ల దేశంలోనే కోట కట్టారు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

