Cycling | ప్రకృతి ప్రేమికులకు థ్రిల్ ఇచ్చే న్యూస్.. అడవి అందాలు చూస్తూ సైక్లింగ్ చేసే ఛాన్స్.. తెలంగాణలోనే!
Cycling | కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు ( Kawal Tiger Reserve Forest - కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం)లో అటవీ శాఖ అధికారులు సైక్లింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇదీ మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్లోని సింగరాయకుంట గేట్ లోపలి నుంచి కెనాల్ అవతలి వైపు గల దండేపల్లి మండలంలోని ఊట్ల వరకు సైక్లింగ్ చేసేందుకు 30 కిలోమీటర్ల మేర ట్రాక్‌లు సిద్ధం చేశారు.
Cycling | మంచిర్యాల, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు ( Kawal Tiger Reserve Forest – కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం)లో అటవీ శాఖ అధికారులు సైక్లింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇదీ మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్లోని సింగరాయకుంట గేట్ లోపలి నుంచి కెనాల్ అవతలి వైపు గల దండేపల్లి మండలంలోని ఊట్ల వరకు సైక్లింగ్ చేసేందుకు 30 కిలోమీటర్ల మేర ట్రాక్‌లు సిద్ధం చేశారు. జన్నారం అడవిలోని తాళ్లపేట, రాజుగూడ, మకుల్పేట్ రేంజ్‌లలో ట్రాక్ విస్తరించి ఉంది. ఇప్పటికే ఉన్న దారులలో మట్టిపోసి, చదును చేస్తూ ట్రాక్‌లను ఏర్పాటు చేశారు. ఈ మూడు రేంజ్‌లలో హిల్‌స్టేషన్స్(గుట్టలపైకి వెళ్లి వచ్చేలా) కవరయ్యేలా మెయిన్ ట్రాక్ నుంచి సబ్ ట్రాక్‌లను లింక్ చేశారు. ప్రస్తుతం తాళ్లపేట నుంచి రాజుగూడ బేస్‌క్యాంపు వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర తొలి సైక్లింగ్ సెగ్మెంట్ పూర్తయ్యింది. రెండో సెగ్మెంట్‌ను మకుల్పేట నుంచి రాజుగూడ వరకు వేయనున్నారు.
సైక్లింగ్ లవర్స్ చిల్ అయ్యేలా ట్రిప్..
ప్రకృతి ప్రేమికులు, సైక్లింగ్ లవర్స్ చిల్ అయ్యేలా సైక్లింగ్ ట్రిప్ ఉండనుంది. పర్యాటకులు వారి సామర్థ్యాన్ని బట్టి సైక్లింగ్ చేసుకోవచ్చు. మెయిన్ ట్రాక్‌కు అనుసంధానంగా సబ్ ట్రాక్‌లు ఉండనున్నాయి. ఒక సబ్ ట్రాక్‌లో వెళ్లి తిరిగి వెనక్కి రావచ్చు. రెండు లేదా మూడు సైడ్ ట్రాక్స్‌లో వెళ్లి కూడా రావొచ్చు. పూర్తిగా మెయిన్ ట్రాక్‌లోనే సైక్లింగ్ చేయచ్చు. ఇలా ఐదు కిలోమీటర్లు మొదలు 30 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. అయితే ఈ సైక్లింగ్ ట్రాక్‌లోకి ఎంట్రీ పాయింట్ ఒక్కటే ఉంటుంది. ఒక్కసారి అందులోకి వెళ్తే మళ్లీ అదే ట్రాక్ నుంచి బయటికి రావాలి. నీటి కుంటలు, వాచ్ టవర్లు కవర్ చేస్తూ ట్రాక్‌లు ఉండనున్నాయి. అటవీ శాఖ వాచర్లు, గైడ్స్ సైక్లింగ్ చేసే వారి వెంట ఉంటారు. వారికి సమాచారం అందిస్తారు. ఒక వేళ సైక్లింగ్ చేస్తూ అలిసిపోతే కాసేపు విశ్రాంతి తీసుకునేలా హట్స్, మంచాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో హాట్స్ ఉండగా.. మరికొన్ని చోట్ల అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సొంతంగా సైకిల్ తెచ్చుకుంటే ఒక ప్యాకేజీ, అటవీశాఖ సైకిల్ ఇవ్వాలంటే మరో ప్యాకేజీ ఉంటుంది. సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా 20 సైకిళ్లను కొనుగోలు చేయనున్నారు. పులులు తిరిగే కోర్ ఏరియాలో సైక్లింగ్ ఉండదు. బఫర్ ఏరియాలో మాత్రమే ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళ వెళ్తే జంతువులు కనిపించే అవకాశం ఉంది. వాటిని ఫొటోలు కూడా తీసుకోవచ్చు. సైక్లింగ్ ట్రాక్‌పై ఎక్కడికక్కడ దారిని సూచించే మ్యాప్స్, సైన్ బోర్డులు ఉంటాయి. వాటిని అనుసరించి సైక్లింగ్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.
తాళ్లపేట నుంచే ఆపరేషన్..
తాళ్లపేట రేంజ్ ఆఫీస్‌ను బేస్ చేసుకొనే సైక్లింగ్ నడుస్తుంది. తపాల్పూర్ రేంజ్ కాంప్లెక్ నుంచి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లాక అక్కడి నుంచి సైక్లింగ్ ట్రాక్ మొదలవుతుంది. అక్కడే ఇన్ఫర్మేషన్ కౌంటర్లు కూడా ఉంటాయి. ఇన్షియల్ స్టేజ్‌లో వారంలో రెండు రోజులు సైక్లింగ్ ఉంటుంది. వచ్చే ఆదరణను బట్టి మిగిలిన రోజులు సైక్లింగ్‌కు ఛాన్స్ ఇస్తాం. ముగ్గురు ఉన్నా కూడా వెళ్లొచ్చు. కానీ.. బ్యాచ్ మొత్తం ఒకే దిక్కు వెళ్లాల్సి ఉంటుంది. వచ్చే వారు ఊరికే తిరిగి వెళ్లకుండా అడవి గురించి కొంత తెలుసుకొని వెళ్లేలా చేస్తాం. – మాధవరావు, డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్, జన్నారం.
నేనూ సైక్లింగ్ చేశా..
సాధ్యమైనంత త్వరగా సైక్లింగ్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం. నేను ఇప్పటికే ఆ ట్రాక్‌లో స్వయంగా సైక్లింగ్ చేశా. మా అధికారులు కూడా వెళ్లొచ్చారు. అది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ప్రకృతి ప్రేమికులకు నచ్చుతుంది. ప్రభుత్వం నుంచి కొన్ని ఫార్మల్ అప్రూవల్స్ రావాల్సి ఉంది. అవి రాగానే సైక్లింగ్ డేట్స్ ప్రకటిస్తాం. ఈ అవకాశాన్ని నేచర్ లవర్స్ ఉపయోగించుకోవాలి.
– శివ్ ఆశిష్ సింగ్, డీఎఫ్‌వో, మంచిర్యాల

Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

