Aman gupta | ఐదు కంపెనీలు పెట్టి చేతులు కాల్చుకున్నాడు.. ఆరో కంపెనీతో వందల కోట్లు సంపాదించాడు
Aman gupta | తొలి అడుగులోనే విజయం సాధించే స్టార్టప్‌లు కొన్ని. మలి అడుగుగా మొదలు పెట్టి మనసు గెలిచేవి కొన్ని. కానీ మార్కెట్లో అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే జనంతో తీన్మార్ క్లాప్స్ కొట్టించుకున్న సంస్థ బోట్ లైఫ్‌స్టైల్. ఓ ఔత్సాహికుడి ఆరో స్టార్టప్ ఇది. హెడ్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, స్పీకర్ల మార్కెట్లో సత్తా చాటుతున్న ఈ అంకుర సంస్థ విజయం వెనుక అమన్ గుప్తా అనే ఐఎస్బీ- హైదరాబాద్ పూర్వ విద్యార్థి ఉన్నాడు.
Aman gupta | తొలి అడుగులోనే విజయం సాధించే స్టార్టప్‌లు కొన్ని. మలి అడుగుగా మొదలు పెట్టి మనసు గెలిచేవి కొన్ని. కానీ మార్కెట్లో అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే జనంతో తీన్మార్ క్లాప్స్ కొట్టించుకున్న సంస్థ బోట్ లైఫ్‌స్టైల్. ఓ ఔత్సాహికుడి ఆరో స్టార్టప్ ఇది. హెడ్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, స్పీకర్ల మార్కెట్లో సత్తా చాటుతున్న ఈ అంకుర సంస్థ విజయం వెనుక అమన్ గుప్తా అనే ఐఎస్బీ- హైదరాబాద్ పూర్వ విద్యార్థి ఉన్నాడు.
బోట్.. ఎలక్ట్రానిక్ ఉపకరణాల మార్కెట్లో పాతిక శాతానికిపైగా వాటా ఉన్న కంపెనీ. అందుబాటు ధరలో హెడ్బ్యాండ్లు, స్పీకర్లు కావాలన్నా, స్మార్ట్ వాచీలు ఎంచుకోవాలన్నా బోట్ వైపు చూస్తారు చాలామంది. 2016లో సంస్థను ప్రారంభించినప్పుడు యువతనే లక్ష్యంగా చేసుకున్నాం. ఫ్యాషనబుల్‌గా ఉంటూనే మన్నికైన ఉత్పత్తిని అందించాలని నిర్ణయించుకున్నాం. ఆ ఆలోచనను అక్షరాలా ఆచరణలో పెట్టాం. బోట్‌కు ముందు నేను ఐదు స్టార్టప్‌లు స్థాపించాను. ఏదీ విజయం సాధించలేదు. అదృష్టం కలిసి రాలేదని నేను నిరాశపడలేదు. ఆ వైఫల్యాలకు కారణాలను విశ్లేషించుకున్నాను. ఆ తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడ్డాను.
నాన్నతో కలిసి
నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్‌లో డిగ్రీ చేశాను. చార్టర్డ్ అకౌంటెన్సీ చదువుకున్నాను. ఇరవై మూడేండ్ల వయసులో నాన్న నీరజ్ గుప్తాతో కలిసి అడ్వాన్స్డ్ టెలీమీడియా పేరిట ఒక సంస్థను ప్రారంభించాను. అంతర్జాతీయ బ్రాండ్స్‌ను మార్కెట్లో పరిచయం చేశాను. తర్వాత కూడా మరో నాలుగు ప్రయత్నాలు చేశాను. కానీ తేడా వచ్చింది. కంపెనీ పెట్టాలంటే పెద్ద ఆఫీసు సెటప్ తప్పనిసరి. ఎక్కువ మంది ఉద్యోగులు ఉండాలి. ఆర్భాటాలు అవసరం.. అని నేను మొదట్లో ఆలోచించేవాణ్ని. కాబట్టే, శక్తికి మించిన ఖర్చుతో భారీ స్థాయిలోనే సంస్థల్ని ప్రారంభించాను. దీంతో ప్రతిసారీ ఆ వ్యవస్థను మేనేజ్ చేయడానికే నా సమయం, శక్తి సరిపోయేవి. ఉత్పత్తి అభిమీద దృష్టి కేంద్రీకరించలేకపోయాను. బోట్ విషయంలో ఆ తప్పు చేయలేదు. మేం అడుగుపెట్టే సరికి మార్కెట్లో రెండొందలకు పైగా పోటీ సంస్థలు ఉన్నాయి. అయినా భయపడలేదు. ఎంత బాగా తయారు చేయగలమనే దానిపై శ్రద్ధ పెట్టాం. జనానికి ఎంత దగ్గరగా తీసుకెళ్లగలననే ఆలోచించాను. ఆఫీసు, బృందం, సెటప్.. ఇవేవీ పట్టించుకోలేదు. అందుకే మా బోట్ ఆఫీసు కాలేజీ క్యాంటీన్లా ఉంటుంది. ఎవరు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఎంతసేపైనా పని చేసుకోవచ్చు. అదే సమయంలో నేను అపజయాల నుంచి పొదుపు సూత్రాలు నేర్చుకున్నాను.
అదే పాఠం
కాన్ఫిడెన్స్కూ ఓవర్ కాన్ఫిడెన్స్కూ మధ్య పెద్ద వ్యత్యాసం ఉంటుంది. ఆ ఆలోచనా విధానం మన పనుల మీద తప్పక ప్రభావం చూపుతుంది. బోట్ స్థాపనకు ముందు నేను పాతాళానికి కూరుకుపోయాను. ఎంత కిందికి వెళ్తే అంతపైకి ఎగరగలం. నేనూ అలానే ప్రయత్నించాను. విజయం సాధించాను. నేను హైదరాబాద్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ పాఠాలు చదువుకున్నాను. కానీ ఏ బిజినెస్ స్కూల్ నుంచి నేర్చుకోలేనన్ని పాఠాలు అపజయాల నుంచి ఒంటబట్టించుకుంటాం. అందుకే ‘ వాట్ దె డోంట్ టీచ్ యు ఎట్ ఇండియన్ బిజినెస్ స్కూల్స్’ (ఇండియన్ బిజినెస్ స్కూళ్లలో చెప్పని పాఠాలు) పేరిట ఒక పుస్తకం రాద్దామనుకుంటున్నా.
ప్రస్తుతం బోట్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వేరబుల్ ఎలక్ట్ట్రానిక్ బ్రాండ్. తక్కువ సమయంలోనే కోటి వస్తువులను ఉత్పత్తి చేశాం. కంపెనీలో 5 వేల మంది పనిచేస్తున్నారు. సంస్థ విలువ రూ.10 వేల కోట్ల పైమాటే. కంపెనీలో నాకు పాతిక శాతం వాటా ఉంది. చాలా మేనేజ్మెంట్ స్కూళ్లు బిజినెస్ పాఠాలు చెప్పడానికి నన్ను పిలుస్తున్నాయి. అందుకు డబ్బు కూడా చెల్లిస్తున్నాయి. అయితే ఆ మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాల కోసం వాడుతున్నాను. ఇప్పుడు నేను ప్రత్యేకంగా డబ్బు సంపాదించాల్సిన అవసరమే లేదు. కానీ, రకరకాల వ్యక్తులతో కలిసి పని చేయడమంటే నాకు ఇష్టం. కొత్తగా ఆలోచించడం, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టడం ఇంకా ఇష్టం. హైదరాబాద్ నాకు కలిసొచ్చిన నగరం. మా కంపెనీకి సంబంధించిన చాలా కార్యక్రమాలకు ఈ నగరం తొలి వేదికైంది.
Read More :
“Nikhil Kamath | 14వ ఏటనే బడి మానేసిన కుర్రాడు.. ఇప్పుడు స్టాక్ మార్కెట్‌కే కింగ్ అయ్యాడు!!”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

