చింతకాని/ ముదిగొండ/ మధిర టౌన్, అక్టోబర్ 4: స్వరాష్ట్రంలోనే పండుగలకు అధిక ప్రాధాన్యం లభిస్తోందని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. పల్లెలకు పట్టం కడుతున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. చింతకాని, ముదిగొండ మండలాల్లో బుధవారం పర్యటించిన ఆయన.. టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి ఆయా మహిళలకు బతుకమ్మ చీరెలు, యువతీ యువకులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు. చింతకాని రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. రంజాన్ తోఫాలు, క్రిస్మస్ గిఫ్టులు, బతుకమ్మ చీరెలు అందిస్తూ అన్ని వర్గాల ప్రజలనూ ఆదరిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. అనంతరం ముదిగొండ రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్ర జల సంక్షేమ కోసం పాటుపడుతున్న కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ము దిగొండలో రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తరువాత మధిర 18వ వార్డులో రూ.25 లక్షలు, 13వ వార్డులో రూ.7 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులకు కూడా జడ్పీ చైర్మన్ శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు తే ళ్లూరి శ్రీనివాసరావు, రమేశ్, మల్లెల రవీంద్రప్రసాద్, ఉష, సత్యావతి, సామినేనిహరిప్రసాద్, వాచేపల్లి లక్ష్మారెడ్డి, వై.రామారావు, అశోక్, సూర్యనారాయణ, డేవిడ్ కరుణాకర్, మం దరపు లక్ష్మి, కోటి అనంతరాములు, మందరపు ఎర్ర వెంకన్న, మీగడ శ్రీనివాస్ యాదవ్, పోట్ల ప్రసాద్, తోట ధర్మారావు, చెరుకుపల్లి భిక్షం, నానబాల కిరణ్, గడ్డం వెంకటేశ్వర్లు, కాజా, వీరబాబు, రజిని, బిక్కి అనిత, వంకాయలపాటి నాగేశ్వరరావు, మొండితోక లత, రమాదేవి, కనుమూరి వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
నేలకొండపల్లిలో..
నేలకొండపల్లి, అక్టోబర్ 4: నేలకొండపల్లి రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి బతుకమ్మ చీరెలను, స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు వజ్జా రమ్య, నంబూరి శాంత, పతానపు నాగయ్య, రాయపూడి నవీన్, శీలం వెంకటలక్ష్మి, ఇమ్రాన్, శివ, అశోకరాణి, సునిత, మాధవి, దేవేందర్ పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్‌లో..
ఖమ్మం రూరల్, అక్టోబర్ 4: ఖమ్మం రూరల్ మండలం బతుకమ్మ చీరెలను, క్రీడా సామగిని ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపలి వరప్రసాద్ పంపిణీ చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడారు. మ హిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. మండలంలోని 27 పంచాయతీల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో ఎంపీపీ, జడ్పీటీసీ కలిసి స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు లక్ష్మణ్‌నాయక్, రవీందర్‌రెడ్డి, పీవీ రామకృష్ణ పాల్గొన్నారు.
కూసుమంచిలో..
కూసుమంచి, అక్టోబర్ 4: కూసుమంచిలో జరిగిన కార్యక్రమంలో బతుకమ్మ చీరెలను, స్పోర్ట్స్ కిట్లను ఎంపీపీ బాణోత్ శ్రీనివాస్ పంపిణీ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రమాదేవి, సంపత్‌కుమార్, కంచర్ల పద్మారెడ్డి, రామాచారి, మోహన్, శంకర్, రేలా విక్రంరెడ్డి, నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.