Youth | బోనకల్లు, ఆగస్టు 3 : ముస్లిం ఐక్యత సంఘం ద్వారా ఐక్యత భావాలను పెంపొందించాలని ముస్లిం ఐక్య సంఘం సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు, మౌలానా ముజాహిద్ ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్ సాహెబ్ కోరారు. ఆదివారం మండలంలోని గోవిందాపురం ఎల్ గ్రామంలో ధార్మిక సభ మండల అధ్యక్షుడు షేక్ మహబూబ్ పాషా అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ధార్మిక విద్యను అభ్యసించి మంచి పౌరులుగా మెలగాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ప్రాపంచిక జ్ఞానంతోపాటు ధార్మిక విద్యను నేర్పించాలని సూచించారు. నైతిక విలువలు పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు.
ముస్లిం సమాజం అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నదని.. ఆర్థికంగా ,సాంఘికంగా ,రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ముస్లింలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ కార్యదర్శి అప్రోజ్ అహ్మద్ అధ్గౌసుద్దీన్,మండల ప్రధాన కార్యదర్శి చాంద్సాహెబ్, ఉపాధ్యక్షులు షాజహాన్, కార్యదర్శి రఫీ, దస్తగిర్, సభ్యులు బాబు, షరీఫ్, మజీద్ కమిటీ అధ్యక్షులు జానిమియా,సభ్యులు రంజాన్, మధార్, సలీం, నాగులు తదితరులు పాల్గొన్నారు.
honesty | బ్యాగులో డబ్బు, బంగారం.. విద్యుత్ శాఖ ఉద్యోగి నిజాయితీకి అధికారుల అభినందనలు
Auto Unions | 14న ఆటోలు బంద్.. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే..