సారపాక, ఆగస్టు 24: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి యువత, నాయకులు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం మణుగూరు క్యాంపు కార్యాలయంలో బూర్గంపహాడ్ మండలానికి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి విప్ రేగా గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, బీఆర్ఎస్ బలోపేతానికి, రానున్న ఎన్నికల్లో విజయానికి కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బూర్గంపహాడ్ మండలానికి చెందిన వడ్లమూడి అశోక్, అశోక్, ఎడమకంటి నర్సింహారెడ్డి, సీహెచ్.ఉమ, వీరన్న పార్టీలో చేరారు. కార్యక్రమంలో మండల నాయకులు కామిరెడ్డి రామకొండారెడ్డి, కొనకంచి శ్రీనివాసరావు, తిరుపతి ఏసోబు, చుక్కపల్లి బాలాజీ, చల్లకోటి పూర్ణ, సోము లక్ష్మిచైతన్యరెడ్డి పాల్గొన్నారు.
మణుగూరు టౌన్, ఆగస్టు 24: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్ మామిడితోట ఏరియాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చల్లా శ్రీను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో క్యాంపు కార్యాలయంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. విప్ రేగా చల్లా శ్రీనుకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జడ్పీటీసీ పోశం నర్సింహారావు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు ముత్యం బాబు, అడపా అప్పారావు, ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు, కోఆప్షన్ సభ్యుడు జావేద్పాషా, కార్యదర్శులు బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి, వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్ పాల్గొన్నారు.
భద్రాచలం, ఆగస్టు 24: కుల వృత్తిదారులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ బీసీ కుల వృత్తిదారులకు రూ.లక్ష చొప్పున అందజేస్తోందని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం బీసీ కులవృత్తిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి రూ.లక్ష సాయం అందుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.