ఖమ్మం:చేపల వేటకు వెళ్లి ప్రమాదశావత్తు యువకుడు మరణించిన సంఘటన ఖమ్మం టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మంలోని రమణ గుట్ట ప్రాంతానికి చెందిన విడగొట్టు హనుమంతు(27) అనే యువకుడు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
రాపర్తి నగర్ బీసీ కాలనీ సమీపంలోని టీఎన్జీవోస్ కాలనీ వద్ద ఉన్న కాలువలో విద్యుత్ సహాయంతో చేపలు వేటాడేందుకు వెళ్లాడు. చేపల వేటకు కరెంటును ఉపయోగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు పిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.