ఖమ్మం : సమ్మెటివ్ అసెస్మెంట్-1 ప్రశ్నాపత్రాలను ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాలని జిల్లా విద్యాశాఖాధికారి సిగసారపు యాదయ్య సూచించారు. బుధవారం ఖమ్మంలోని రిక్కాబజార్ పాఠశాలలో డీసీఈబీ ఆధ్వర్యంలో ఎస్ఏ-1 ప్రశ్నాపత్రాల వర్క్‌షాపు నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో డీఈఓ యాదయ్య ముఖ్యఅతిధిగా పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక్కపేపర్ మాత్రమే తయారు చేయాలన్నారు. పాఠశాలలు సకాలంలో ఫీజు చెల్లించి సహకరించాలని కోరారు. సిలబస్‌ను అక్టోబర్ వరకు పరిగణలోకి తీసుకుని తయారు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు, సబ్జెక్ట్ నిపుణులు పాల్గొన్నారు.