చండ్రుగొండ, డిసెంబర్ 2 : పది రోజులుగా మిషన్ భగీరథ నీరు నల్లాల ద్వారా సరఫరా కాకపోవడంతో విసుగు చెందిన మహిళలు, గ్రామస్తులు మండలంలోని వెంకటాపురం గ్రామంలో తిప్పనపల్లి-సుజాతనగర్ రహదారిపై సోమవారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పది రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడంలేదని పలుమార్లు పంచాయతీ అధికారులు, సిబ్బందికి తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ గ్రామంలో 50 ఇళ్ల వరకు ఉన్నా.. తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నామని, కిలో మీటర్ దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పం దించి తాగునీరు సరఫరా చేయని పక్షంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.