Karepalli | బైక్‌ను ఢీ కొట్టిన ట్రాక్టర్ మహిళ మృతి
ట్రాక్టర్, బైక్‌ను ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన గురువారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పాత లింగాల స్టేజి వద్ద చోటుచేసుకుంది.
కారేపల్లి,(కామేపల్లి) ఏప్రిల్ 23 : ట్రాక్టర్, బైక్‌ను ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన గురువారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని పాత లింగాల స్టేజి వద్ద చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కారేపల్లి మండల పరిధిలోని మాదారం గ్రామానికి చెందిన వేముల భాగ్యలక్ష్మి(33) ఆమె భర్త వేముల గోవిందరాజులు బైక్ పై మాదారం నుండి ఖమ్మం వెళ్తున్నారు.ఈ క్రమంలో ఇల్లెందు ఖమ్మం ప్రధాన రహదారి పాత లింగాల స్టేజి వద్ద వారు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది.బైక్ పై వెనుక కూర్చున్న భాగ్యలక్ష్మి ట్రాక్టర్ డీ కొనడంతో కింద పడిపోయింది.దీంతో ట్రాక్టర్ టైర్ ఆమె తలపై ఎక్కడంతో మెదడు రోడ్డుపై చల్లా చెదురుగా పడిపోయింది.
పాత లింగాల చెరువు నుండి జాస్తిపల్లి వైపు మట్టి తోలకాలు జరుపుతున్న ట్రాక్టర్ డ్రైవర్ పాత లింగాల స్టేజి వద్ద రోడ్డు దాటే క్రమంలో నిర్లక్ష్యంగా ఉండడం వల్లే మోటార్ సైకిల్ ని ఢీ కొట్టి మహిళా మృతికి కారణమైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.సమాచారం అందుకున్న కామేపల్లి పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఋతురాలి కుటుంబానికి డాక్టర్ యజమాని న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు,బంధువులు, మాదారం గ్రామ పెద్దలు డిమాండ్ చేశారు.న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించమని సంఘటన స్థలంలోనే భీష్మంచి కూర్చున్నారు.ఈ విషయమై ఇరువైపులా చర్చలు కొనసాగుతున్నాయి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

