మెరిసిన ఎర్ర బంగారం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పెరగడంతో పంట పండించిన రైతుల్లో ఆశలు చిగురించాయి. సోమవారం క్వింటా ఏసీ మిర్చి ధర రూ.1,200, కొత్త మిర్చి ధర రూ.500 చొప్పున పెరగడంతో ఆనందం వ్యక్తమవుతోంది. గత బుధవారంతో పోల్చితే ఒక్కరోజే మిర్చి ధర భారీగా పెరిగింది. ఏసీ మిర్చి రూ.19,700, కొత్త మిర్చి ధర రూ.19,500లకు చేరింది. ఈ ఏడాదిలోనే ఇది అత్యధిక పెరుగుదల అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నారు.
- ఒక్క రోజే రూ.1,200 మేర ధర పెరగడంతో కర్షకుల్లో ఆనందం
- ఇదే ధర నిలకడగా ఉండాలని కోరుకుంటున్న మిర్చి రైతులు
ఖమ్మం, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర పెరగడంతో పంట పండించిన రైతుల్లో ఆశలు చిగురించాయి. సోమవారం క్వింటా ఏసీ మిర్చి ధర రూ.1,200, కొత్త మిర్చి ధర రూ.500 చొప్పున పెరగడంతో ఆనందం వ్యక్తమవుతోంది. గత బుధవారంతో పోల్చితే ఒక్కరోజే మిర్చి ధర భారీగా పెరిగింది. ఏసీ మిర్చి రూ.19,700, కొత్త మిర్చి ధర రూ.19,500లకు చేరింది. ఈ ఏడాదిలోనే ఇది అత్యధిక పెరుగుదల అని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నారు.
మార్కెట్లో కొన్ని వారాలుగా మిర్చి ధరలు నిలకడగా లేకపోవడంతో ఆందోళనకు గురైన రైతులు తాజాగా పెరిగిన ధర కొంత ఊరట ఇస్తున్నది. అయితే వాతావరణ మార్పులు, పంట దిగుబడి తగ్గడం, నాణ్యమైన మిర్చికి దేశీయ మార్కెట్లో డిమాండ్ ఉండడం వల్లే ధరలు ఒక్కసారిగా పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు విక్రయానికి వచ్చే మిర్చి తగ్గిపోవడంతో వేలం పాటలో వ్యాపారుల మధ్య పోటీ సైతం నెలకొంది. దీనివల్ల ధరలు పెరిగినట్లు కూడా సమాచారం.
గత నెల వరకు పోల్చితే మిర్చి ధర కేవలం రూ.15 వేలకే పరిమితమైంది. వరుస సెలవుల తర్వాత మార్కెట్‌కు భారీగా మిర్చి చేరుకోవడంతో రూ.20 వేల సమీపానికి చేరింది. మార్కెట్‌కు కొత్త మిర్చి భారీగా వస్తుండడంతో ధరలో పురోగతి కనిపిస్తున్నది. 2024లో మిర్చి క్వింటా ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలికింది. రెండేళ్లుగా తెలంగాణ మిర్చికి విదేశాల్లో డిమాండ్ లేకపోవడంతో ఒక్కసారిగా ధర భారీగా పతనమైంది. కాగా, ఈ ఏడాది తెగుళ్లు, అధిక వర్షాల కారణంగా దిగుబడులు పూర్తిగా తగ్గాయి. ఏటా లక్ష ఎకరాల్లో సాగయ్యే మిర్చి ఈ ఏడాది కేవలం 40 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. సీజన్లో మార్కెట్‌కు వచ్చే సరుకు పెరిగినప్పటికీ ఇదే ధర కొనసాగాలని పంట సాగు చేసిన రైతులు కోరుకుంటున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

