మధిర, నవంబర్ 2 : కారు గుర్తుపై ఓటు వేసి మీ ఇంటి వాడిగా నన్ను ఆశీర్వదించాలని మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు ఓటర్లను కోరారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 10 వార్డుల్లో ఆయన గడపగడపకూ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమల్‌రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కేసీఆర్ సహకారంతోనే మధిర పట్టణంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నామన్నారు. ఇప్పటికే 100 పకడల ఆసుపత్రి నిర్మాణం సహా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు, మినీ ట్యాంక్‌బండ్, ఇండోర్ స్టేడియం వంటి పనులు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే రూ.400కే గ్యాస్ సిలిండర్, అన్నపూర్ణ పథకం కింద తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ సన్నబియ్యం, ఆరోగ్య రక్ష కింద రూ.15 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా కింద రూ.5 లక్షలు బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కనుమూరి వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ శీలం విద్యాలతవెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ మూడ్ ప్రియాంక, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ యన్నంశెట్టి అప్పారావు, కౌన్సిలర్లు మల్లాది వాసు, ధరావత్ మాధవి, నాయకులు జే.వీ.రెడ్డి, ఆవుల రాము, బోగ్యం, ఇందిర, కరివేద వెంకటేశ్వరరావు, సుధాకర్, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.