MLA Ramdas Nayak | కారేపల్లి, సెప్టెంబర్ 8: రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి, పేదల సంక్షేమ మార్గం నడుస్తుందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇంటితో సాకారం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లులేని పేదలను గుర్తించి వారికి విడుతల వారిగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయటమే కాక బిల్లులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తుందన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పంటలను సర్వే చేయించి వారికి పరిహారం ఇవ్వటానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజాశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియా కొరత సృష్టిస్తుందని దానిని అధిగమించటానికి రాష్ట్రం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతుందన్నారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన..
సింగరేణి మండలం బీటీ రోడ్ల పనులకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ శంకుస్థాపన చేశారు. భాగ్యనగర్ తండా నుండి పోలంపల్లి వరకు రూ.80 లక్షలతో చేపట్టనున్న బీటీ రోడ్డు, భజ్యాతండాగిద్దవారిగూడెం వరకు రూ.1.70 లక్షలతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పనులు నాణ్యత లోపాలు లేకుండా గ్రామస్తులు పర్యవేక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సోసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనివాసరావు, ఎంపీడీవో పీ శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు పగడాల మంజుల, తలారి చంద్రప్రకాశ్, బానోత్ రాంమూర్తి, బానోత్ దేవ్లానాయక్, ఇమ్మడి తిరుపతిరావు, మేదరి వీరప్రతాప్, దారావత్ భద్రునాయక్, గడ్డం వెంకటేశ్వర్లు, పెద్దబోయిన ఉమాశంకర్, ఆలోత్ ఈశ్వరీనందరాజ్, బానోత్ రూప్ల, అజ్మీర ఈర్యా, కిలారి అప్పారావు, దారావత్ హేమలత బాలాజీ, అజ్మీర హేమ్లానాయక్, హట్కర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
MGBS | ప్రయాణికులకు శుభవార్త.. ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం