కారేపల్లి, జూలై 17 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం ఎర్రబోడు గ్రామంలో ఆదివాసీ గిరిజనులపై అటవీ అధికారులు చేసిన దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు అన్నారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఇది పూర్తిగా ఆసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ దాడిగా అభివర్ణించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆదివాసీ గిరిజనులకు 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల పట్టాలు ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి న్యాయం చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. గిరిజనులపై అటవీ శాఖ అధికారులు చేసిన దౌర్జన్యంపై ఎస్టీ, మానవ హక్కుల కమిషన్, గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.