Sagar Canals | మధిర, ఫిబ్రవరి 22 : వార బంధి లేకుండా సాగర్ కాలువల (Sagar Canals)కు సాగునీరు విడుదల చేయాలని మధిర డివిజన్ వ్యవసాయ ఉపసంచాలకులు స్వర్ణ విజయచంద్రకు రైతులు విజ్ఞప్తి చేశారు. ఇవాళ చింతకాని మండలం లోని తూటికుంట్ల మేజర్ కాలువ పరిధిలోని నీటి ఎద్దడికి గురైన మొక్కజొన్న వైర్లను వ్యవసాయ, ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతు గడ్డం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తూటికుంట్ల మేజర్ కాల్వ పరిధిలో 1400 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం గింజ దశలో మొక్కజొన్న పైరు ఉందని సకాలంలో సాగు నీరు లేకపోవడం వలన దిగుబడి వచ్చే పరిస్థితి లేదని అధికారులకు తెలిపారు. జిల్లా అధికారులతో మాట్లాడి వెంటనే నీటి విడుదల చేయాలని కోరారు.
కాల్వ ప్రక్కనే ఉన్న రైతులకు సాగునీటిని బంద్ చేసి.. కింద రైతుల కోసం నీటిని తరలించడం మాకు అన్యాయం చేయటమేనని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంటలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ విజయ చంద్ర మాట్లాడుతూ.. రైతులు సాగు చేసిన పంటలకు కావాలసిన నీటి అవసరాల గురించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
మరో రెండు రోజుల్లో వారబంధిలో భాగంగా తూటికుంట్ల మేజర్ కాల్వకు ఇరిగేషన్ అధికారులు నీటి విడుదల చేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏవో మానస, ఏఈ సంపత్ కుమార్ ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి