పాల్వంచ, డిసెంబర్ 5 : పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డుమెంబర్ల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. పాత పాల్వంచలోని వనమా నివాసంలో శుక్రవారం పాల్వంచ మండలంలో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులందరూ ఆయన్ని కలిశారు.
ఈ సందర్భంగా వనమా వారందరినీ ఆశీర్వదించి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజలకు ఆ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన దాన్ని, రైతులకు మొండిచేయి చూపిన దానిపై వివరంగా తెలియజేస్తూ ఓట్లు అభ్యర్థించాలన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి పార్టీని గెలిపించుకుందామన్నారు. వనమాను కలిసిన వారిలో మంతపురి రాజుగౌడ్, కాంపెల్లి కనకేష్ పటేల్, పూసల విశ్వనాథం, మల్లెల విశ్వనాథం, రమణమూర్తినాయుడు, దాసరి నాగేశ్వరరావు, కొత్వాల సత్యనారాయణ, దొడ్డ సురేష్ తదితరులు ఉన్నారు.