బీఆర్ఎస్ను మరింత పటిష్టపరుస్తాం..
బీఆర్ఎస్ పార్టీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని బూత్, వార్డు, గ్రామస్థాయిల్లో మరింత పటిష్ట పరుస్తామని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం పాత పాల్వంచలోని తన నివాసంలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ కమిటీల సన్నాహక సమావేశం నిర్వహించారు.
- పార్టీ సభ్యత్వాన్ని విజయవంతం చేస్తాం..
- మాజీ మంత్రి వనమా
పాల్వంచ, మే 18 : బీఆర్ఎస్ పార్టీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని బూత్, వార్డు, గ్రామస్థాయిల్లో మరింత పటిష్ట పరుస్తామని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం పాత పాల్వంచలోని తన నివాసంలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయ కమిటీల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేసి కేసీఆర్‌ని మళ్లీ సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.
అన్నివర్గాలకు న్యాయం చేయడం కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజుగౌడ్, మల్లెల రవిచంద్ర, కార్పొరేటర్లు బత్తుల మధుచంద్, గుగులోత్ రాంబాబు, సింధుతపస్వీ, పట్టణ నాయకులు ముత్యాల ప్రవీణ్, బట్టు మంజుల, దాసరి నాగేశ్వరరావు, సత్యనారాయణ, శేఖర్, చందూనాయక్, బాకూరు లక్ష్మీనాయుడు, మిర్యాల అలివేలు, జవహర్, నారికట్ల శేఖర్, ఆదినారాయణ, దాసరి సురేష్, సునీల్, నరేందర్, శ్యాంసుందర్‌రెడ్డి, ఏనుగుల శ్రీను, పూల రవీందర్, రాందాస్, మోతి, శివ, శ్రీకాంత్, ఓంప్రకాష్, వాసుమల్ల గౌతం, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

