ఖమ్మం, ఏప్రిల్ 30: యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొనుగోళ అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్‌లతో కలిసి హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోలు చేయాలని సూచించారు. అనంతరం తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్, 1638 రకాల ధాన్యంలో నూకలు అధికంగా వస్తాయనే కారణంతో మిల్లర్లు తిరసరిస్తున్నట్లు గమనించామన్నారు. ఈ వీపీలో ఖమ్మం నుంచి ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్లు శ్రీజ, పీ.శ్రీనివాస్‌రెడ్డి, ఇతర అధికారులు సన్యాసయ్య, చందన్‌కుమార్, శ్రీలత, అలీమ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, ఏప్రిల్ 30: పెండింగ్‌లో ఉన్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది జీతాలను, పేస్కేల్ ఇప్పించాలని కోరుతూ బుధవారం ఎంపీడీవో సురేందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి జీతాలు అందకపోవడంతో అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కే.నాగరాజు, జే.లక్ష్మయ్య, జీ.బాస్కర్, ఆర్.కాంతమ్మ, నాగేశ్వరరావు, రియాజ్, డీ.సుధాకర్, ఎం.పుల్లారావు ఉన్నారు.