కొత్తగూడెం సింగరేణి, జనవరి 30: సంస్థలో రెండేళ్లుగా ఖా ళీగా ఉన్న డైరెక్టర్(ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), ఈ నెలాఖరుతో ఖాళీ అవుతున్న డైరెక్టర్(ఆపరేషన్) పోస్టులను భర్తీ చేస్తూ సీఎండీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఛాంబర్లో సెలక్షన్ కమిటీ ఇద్దరిని ఈ పోస్టులకు ఎంపిక చేశారు. మణుగూరు జీఎం జీ వెంకటేశ్వర్‌రెడ్డిని డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్)గా, అడ్రియాలా జీఎం ఎన్వీకే శ్రీనివాస్‌ను డైరెక్టర్ (ఆపరేషన్స్)గా నియమిస్తూ సీఎండీ శ్రీధ ర్ ఆదేశాలు జారీ చేశారు. వీరిద్దరు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రెండేళ్ల కాల పరిమితితో కొనసాగనున్నారు. సంస్థలో నలుగురు డైరెక్టర్లు పూర్తిస్థాయిలోబాధ్యతలు చేపట్టనుండడంతో కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం డైరెక్టర్ (పా) చంద్రశేఖర్ ఉద్యోగ విరమణ నేపథ్యంలో డైరెక్టర్ (ఫైనాన్స్) బలరాంకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ సీ ఎండీ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కలిసొస్తున్న ఏపీఏ డివిజన్
ఏపీఏ డివిజన్ (అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా) జీఎంలకు కలిసొస్తున్నది. ఇక్కడ పని చేసిన వారంతా డైరెక్టర్లుగా ఎంపిక కావడం విశేషం. ఈ డివిజన్‌కు మొదటగా 2010 నుంచి 2015 వరకు జీఎంగా ఉన్న బీ. భాస్కర్‌రావు తొలుత సింగ రేణి డైరెక్టర్ (పీపీ)గా ఎంపికయ్యారు. ఆ తర్వాత 2015 నుం చి 2017 వరకు జీఎంగా ఉన్న ఎస్. చంద్రశేఖర్ కూడా డైరెక్ట ర్(ఆపరేషన్)గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2017 నుంచి 2019 వరకు జీఎంగా కొనసాగిన బీ.వీరారెడ్డి కోలిండియా టెక్నికల్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఆయన స్థా నంలో 2019లో జీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎన్వీకే శ్రీని వాస్ ప్రస్తుతం డైరెక్టర్(ఆపరేషన్)గా అవకాశం దక్కింది. దీం తో సీనియర్ అధికారుల దృష్టి ప్రస్తుతం ఏపీఏ డివిజన్‌పై పడింది.