ఖమ్మం : ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..తిరుమలాయపాలెం మండలంలోని మేకల తండా వద్ద ఖమ్మం -వరంగల్ జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి.
బొగ్గు లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగి ఓ లారీ డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి సజీవ దహనం అయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, ఫైర్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. పూర్తి వివరించారు.