వెంకీ కుటుంబానికి హైకోర్టులో చుకెదురు
ఓ ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా న మోదైన క్రిమినల్ కేసులో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు, నటులు వెంకటేశ్, రాణా, అభిరామ్లకు హైకోర్టులో చుకెదురైంది. నాంపల్లి కోర్టులో వారిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేయడానికి కోర్టు నిరాకరించింది.
- క్రిమినల్ కేసును కొట్టివేయడానికి నిరాకరణ
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఓ ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా న మోదైన క్రిమినల్ కేసులో సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు, నటులు వెంకటేశ్, రాణా, అభిరామ్లకు హైకోర్టులో చుకెదురైంది. నాంపల్లి కోర్టులో వారిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేయడానికి కోర్టు నిరాకరించింది. లీజు వివాదంపై కోరె నందుకుమార్ ఫిర్యాదు ఆధారంగా నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని సు రేశ్, వెంకటేశ్ తదితరులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ ఎన్ తుకారాంజీ విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇది పూర్తిగా సివిల్ స్వభావానికి చెందినదని, క్రిమినల్ కేసుగా మార్చి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు.
ప్రతివాది తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ లీజు ప్రాంతంలోకి పిటిషనర్లు అక్రమంగా ప్రవేశించారని, తలుపులు పగులగొట్టి, వస్తువులు తీసుకెళ్లారని చెప్పారు. దీనిపై ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా నాంపల్లి కోర్టు కేసు విచారణ చేపట్టిందని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి సివిల్ వివాదం నేపథ్యంలో క్రిమినల్ కేసు నమోదైందన్న కారణంగా కేసును కొట్టివేయలేమని పేరొన్నారు. పిటిషనర్లపై క్రిమినల్ కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని అన్నారు. ఫిర్యాదుతోపాటు అఫిడవిట్లను పరిగణనలోకి తీసుకున్నాకే మెజిస్ట్రేట్ ఫిర్యాదును స్వీకరించారని తెలిపారు. ఫిర్యాదులోని అంశాలపై ఏవైనా అభ్యంతరాలుంటే కింది కోర్టులోనే తేల్చుకోవాలంటూ పిటిషన్‌ను కొట్టివేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Students Appeal | ‘సీఎంగారూ చొరవ చూపండి.. హిందీ టీచర్‌ను నియమించండి’ అంటూ విద్యార్థుల లేఖాస్త్రం..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
KCR | బతుకమ్మ.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే ఆటాపాటల సాంస్కృతిక వైభవం..!
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

