దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా విజయవంతమైన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు సాయిరాజేష్. హృదయకాలేయం, కొబ్బరిమట్ట, బేబి చిత్రాలతో డైరెక్టర్‌గా.. కలర్‌ఫొటో, చెన్నై లవ్‌స్టోరీ సినిమాలతో రచయితగా సత్తాచాటారాయన. మరో నిర్మాత ఎస్కేఎన్తో కలిసి సాయిరాజేష్ నిర్మించిన ‘చెన్నైలవ్‌స్టోరీ’ ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద యాభైకోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో గురువారం చిత్ర కథారచయిత, నిర్మాత సాయిరాజేష్ విలేకరులతో ముచ్చటించారు.