శేరిలింగంపల్లి : రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో కేటీఆర్ సమక్షంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు భారీ ఎత్తున బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో పార్టీ బలోపేతానికి సమిష్టిగా పనిచేయాలన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో శ్రీకాంత్, డీజే నాని, సాయి, సచిన్, నితిన్, రోహిత్ తదితరులు ఉన్నారు.