Prithvi Shaw : భారత యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) క్రికెట్ పరంగానే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. టీమిండియాకు దూరమైన ఈ కుర్ర ఓపెనర్.. పెళ్లికి ముందే ప్రేయసికి దూరమయ్యాడు. ఆకృతి అగర్వాల్ (Akriti Agarwal)తో నిశ్చితార్థం చేసుకున్న పృథ్వీ తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించలేకపోయాడు. ఈమధ్య అతడి ప్రవర్తనను తప్పుపడుతూ పోస్టులు పెట్టిన ఆకృతి.. ఎట్టకేలకు ‘మేము విడిపోతున్నాం’ అని ప్రకటించింది. మంగళవారం ఆమె అవును మాకు బ్రేకప్ అయింది అని చెప్పడంతో కొన్ని రోజులుగా మీడియాలో వచ్చిన వార్తలు నిజమయ్యాయి.
యువ క్రికెటర్ పృథ్వీ షాకు మరో ఎదురుదెబ్బ. ఇప్పటికే పేలవమైన ఆటతో భారత జట్టుకు దూరమైన అతడికి ప్రేయసి ఆకృతి అగర్వాల్ బ్రేకప్ చెప్పింది. మే నెలలో నిశ్చితార్థం నుంచి వార్తల్లో నిలిచిన ఈ జంట త్వరలోనే విడిపోనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఆకృతి. ‘భారమైన హృదయంతో ఈ విషయం మీతో చెబుతున్నా. కానీ, భవిష్యత్ పట్ల ఇద్దరి లక్ష్యాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉన్నందున నేను, పృథ్వీ షా విడిపోయాలని నిర్ణయించుకున్నాం. మాకు ఒకరిపై ఒకరికి అంతులేని ప్రేమ ఉంది.
Indian cricketer Prithvi Shaw and Akriti Agarwal have mutually decided to part ways and end their engagement.#PrithviShaw #Cricket #Sportskeeda pic.twitter.com/Zq4bSjjThQ
— Sportskeeda (@Sportskeeda) September 17, 2026
అయితే.. మా ఇద్దరి దారులు వేరనే విషయం ఇద్దరం గ్రహించాం. ప్రస్తుతం మేము ఎదుర్కొంటున్న పరిస్థితులు, మాకున్న బాధ్యతలు అందుకు ఓ కారణం. అందుకే.. పరస్పర అంగీకారంతోనే మేము విడిపోతున్నాం. మేము ఎవరి దారి వారు చూసుకుంటున్నందున.. ఇద్దరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా.
Akriti Agarwal has announced her separation from Indian cricketer Prithvi Shaw, around six months after the couple publicly announced their engagement.
Taking to Instagram, Agarwal shared an emotional statement confirming that the two had mutually decided to part ways. She said… pic.twitter.com/namDvBtKVp
— IndiaToday (@IndiaToday) September 17, 2026
ఈ కష్ట సమయంలో మా గోప్యతను అర్ధం చేసుకోవాలని, తప్పుడు ప్రచారం చేయొద్దని అందరిని అభ్యర్థిస్తున్నా. మమ్మల్ని అర్ధం చేసుకొని.. మాకు ప్రైవసీ ఇస్తున్నందుకు ధన్యవాదాదాలు’ అని ఆకృతి సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. రెండు నెలల క్రితం టోక్యో పర్యటనకు వెళ్లిందీ జంట. అయితే.. ఏమైందో తెలియదు తమ టూర్ వ్లాగ్స్ను తొలగించింది ఆకృతి. దాంతో.. వీరిద్దరి మధ్య అంతా సవ్యంగా లేదని గాసిప్స్ వచ్చాయి. చివరకు అవే వదంతులను నిజం చేసింది ఆకృతి.
ఈ ఏడాది మేలో పృథ్వీ షా, ఆకృతిల ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. సినిమా నటి అయిన ఆకృతికి ఉంగురం తొడిగిన ఫొటోలను ఈ డాషింగ్ బ్యాటర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘నా పర్ఫెక్ట్ ఇన్నింగ్స్’ అనే క్యాప్సన్ జోడించాడు షా. ఎంగేజ్మెంట్ అనంతరం ఇద్దరూ అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో తళుక్కుమన్నారు కూడా. కానీ, ఉన్నట్టుండి.. మా దారులు వేరని అందరికీ షాకిచ్చిందీ జోడీ.
🚨 Aakriti Agarwal has officially confirmed her breakup with Prithvi Shaw in an Instagram post.
What is surprising is that the two went on a trip to Tokyo just two months ago. She has also deleted their photos from Instagram and removed the trip vlogs from her YouTube channel…
— Wickets Hitting (@offpacedelivery) September 17, 2026