రామగిరి, సెప్టెంబర్ 17 : సృష్టిలో ఉన్న సకల కళలకు ఆరాధ్య దైవం శ్రీమద్విరాట్ విశ్వకర్మ భగవానుడని విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గౌరవ సలహాదారు కొండొజ కృష్ణామాచారి అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బ్రహ్మంగారి గుట్టపై శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ప్రాంగణంలో భగవాన్ విశ్వకర్మ జయంతి ఉత్సవాల సందర్భంగా యజ్ఞోత్సవాలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సృష్టిలోని అన్ని రంగాల వాళ్లు ఆరాధించవలసిన దైవం విశ్వకర్మ భాగవానుడని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్శర్మ, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు దాసోజు యాదగిరి చారి, ప్రధాన కార్యదర్శి పెండోట సోము, కటకం వెంకటాచారి, పందిళ్లపల్లి బ్రాహ్మచారి, శివకోటి, హరిప్రసాద్, పోలోజు శ్రీనివాసచారి, దేవులపల్లి వెంకటాచారి, చోల్లేటి లక్ష్మణ్ పాల్గొన్నారు.