చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు.. గర్భిణులకు సీమంతాలు
బూర్గంపహాడ్ మండల పరిధి వేపలగడ్డ పంచాయతీలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు, గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 17 : బూర్గంపహాడ్ మండల పరిధి వేపలగడ్డ పంచాయతీలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం పోషణ మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు, గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేపలగడ్డ సర్పంచ్ నిరోష ముఖ్య అతిధిగా హాజరై పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తల్లులు, గర్భిణులు తీసుకున్నప్పుడే తల్లులు, బిడ్డ ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. పోషక విలువలతో కూడిన ఆహారంతో పిల్లలు బరువు, ఎదుగుదల ఉంటుందన్నారు. అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారాన్ని గర్భిణులు, తల్లులు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలుత గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి తల్లులు, గర్భిణులు, పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వరాజ్యం, కార్యదర్శి కిరణ్, అంగన్వాడీ టీచర్లు, ఐటీసీ సిబ్బంది ప్రమీల, ప్రశాంతి, తల్లులు, గర్భిణులు, పిల్లలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

