Basu Hanumanthu Naidu | బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి : బాసు హనుమంతు నాయుడు
Basu Hanumanthu Naidu | తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని జోగులాంబ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు అన్నారు.
జోగులాంబ గద్వాల : తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ ( KCR ) దేనని జోగులాంబ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ( Basu Hanumanthu Naidu ) అన్నారు. గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం మల్లాపురం తండా , గట్టు మండలం వాయిలకుంట తండా గ్రామాలలో కేసీఆర్ చిత్రపటాలకు గిరిజనులతో కలిసి పాలాభిషేకం చేశారు.
ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తండాల్లో గిరిజనులు అసౌకర్యాల మధ్య జీవనం కొనసాగించారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని వెల్లడించారు . ఎస్టీల రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచారని, గిరిజన విద్యార్థులకు 71 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దాదాపు అన్ని గిరిజనతండాలకు తారు రోడ్ల నిర్మాణం చేశారన్నారు.
గిరిజన మహిళల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వంలో అనేక పథకాలను అమలు చేశారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జి.రాఘవేంద్ర రెడ్డి, సర్పంచులు సాకి డేవిడ్, తిమ్మప్ప, మాజీ సర్పంచులు కృష్ణవేణి నరేందర్ నాయక్,లక్ష్మీకాంత్ రెడ్డి, అంగడి బసవరాజ్,పటేల్ జనార్దన్ రెడ్డి, ప్రతాప్, రంగ నాయక్ , బీచుపల్లి, చక్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాసు గోపాల్, ఎస్.రాము నాయుడు, టీ.రవి, రాజు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

