TSUTF | మధిర, మార్చి 2 : గత రెండున్నర సంవత్సరాలుగా ట్రెజరీల్లో ఆమోదం పొంది ఇ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే విడుదల చేయాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. ఇవాళ మధిరలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో చావ రవి మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా సెలవు జీతాలు, సప్లిమెంటరీ వేతనాలు, మెడికల్ బిల్లులు, జిపిఎఫ్, పెన్షన్, టీఎస్ జిఎల్‌ఐ తదితర బిల్లులు విడుదల కాలేదన్నారు.
ఉద్యోగులు, గత మార్చి నుండి రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మొత్తాలను చెల్లించకపోవడంతో పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బకాయి పడిన నాలుగు వాయిదాల డీఏలు వెంటనే ప్రకటించాలన్నారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి ఉద్యోగ సంఘాలతో చర్చించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జీఓ 317 బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాత విధానాన్ని కొనసాగించడం విచారకరమన్నారు. జీఓ 317ను సవరించి బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు డీఈఓ, అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేసి, రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని కోరారు. గురుకులాల పనివేళలు మార్పు చేయాలని, కేజీబీవీ ఉద్యోగులకు బేసిక్ పే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శులు షేక్ నాగూర్ వలీ, అనుమోలు కోటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జివి నాగమల్లేశ్వరరావు, ప్రాంతీయ కార్యాలయం కన్వీనర్ ఏ వినోద్ రావు, మధిర మండల ప్రధాన కార్యదర్శి ఈ.వీరయ్య, సీనియర్ నాయకులు ఎన్ వీరబాబు, టి ఆంజనేయులు ఆర్ లక్ష్మణరావు, మీరాఖాన్, సాంబయ్య, ఆశీర్వాదం, శ్రీనివాస్, అజయ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు షేక్ ఇబ్రహీం, ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ కన్వీనర్ మల్ల రాజు, కార్యదర్శులు జీబిఎంఎస్ రాణి, వి.కొండలరావు, ఎండి రఫీ, షేక్ జానీమియా, ఎ.రాంబాబు, డి.మహేంద్ర కుమార్, పి.రాజేష్. సంధ్యా లక్ష్మి, యస్.శైలజ, బి.రాణి, షేక్ హసీనాబేగం, ఇర్రి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.